అందుకె నా ముద్దుతో నీకు దిష్టి తీసేస్తున్న అంటు మరోసారి ఆమె అదరాల్లో మధువుని సేవించే పని మొదలుపెట్టాడు అర్జున్….
కొన్ని నిముషాలు ఇద్దరు ఆ ముద్దు మైకం లో మునిగిపోతారు…
కొద్ది సమయం తరువాత అటువైపు ఎవరివో మాటలు వినిపించడం తో ఇద్దరు ఆ మైకం నుండి బయటకి వచ్చి ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని మరోసారి హగ్ చేస్కుని వదిలి హ్మ్ ఇక పద ఇక్కడే ఇంకాసేపు ఉన్నామంటే నిజంగానే ఎవరో ఒకరికి దొరికిపోయే లా వున్నాం అంటూ ఆద్య అర్జున్ నీ తీస్కుని అక్కడ నుండి అందరి దగ్గరకి వెళ్తుంది…
అలా అన్ని సంతోషాల మధ్య ఎంగేజ్మెంట్ పూర్తయింది….
అర్జున్ రెండు రోజులు ఊరిలో ఉండి సరదాగా ఆద్య తో కొన్ని హ్యాపీ మూమెంట్స్ పోగుచేసుకుని ఆ తరువాత సీటీ కి వెళ్ళిపోతాడు జాబ్ పర్పస్ మీద…
ఆద్య భారంగానే అర్జున్ కి సెండాఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాక పెళ్ళి పనుల్లో నిమగ్మమ్ అవుతుంది….