ఉదయమే లేచిన అర్చిత ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ల నాన్న కోరిక మేరకు పెళ్లి చూపులకి రెడీ అవుతుంది
వాళ్ళ అమ్మ ది పట్టు చీర కట్టుకొని దానికి తగ్గట్టు బ్లౌజ్ వేస్కోని… ఆవిడదే హారం పెట్టుకొని సింపుల్ గా జడ వేస్కోని పువ్వులు పెట్టుకొని రెండు చేతులకి డజన్ గాజులు వేసి ఎలాంటి మేకప్ లేకుండా స్టిక్కర్ పెట్టి దాని కింద కొంచెం కుంకుమ పెట్టి కళ్ళకి కాటుక పెట్టి అచ్చం మహాలక్ష్మి లా ఉంది అర్చిత…
” శక్కు అమ్మాయి రెడీ అయిందా..!! ” అంటూ అడిగారు గోపాల్ గారు
” హ ఎప్పుడో.. మీరు టెన్షన్ పడకండి..” కూర్చోండి అంటూ కూర్చోపెట్టారు శక్కు