మజిలీ ❤️
ఎపిసోడ్ 6 …
ధీర్ ఎప్పుడు ఆ అమ్మాయి వెనక్కి తిరుగు తుందా .. అని చూస్తున్నాడు..
కానీ మనసు మాత్రం ఆ అమ్మాయి నీ ఎక్కడో చుసవ్ అని చెప్తుంటే అలాగే ఆ అమ్మాయినే చూస్తూ వున్నాడు…
ధీర్ అక్కడి కి రావడం చూసిన కౌసల్య గారు నాన్న ధీర్ రా లోపలికి అని పిలిచి అమ్మ ధాత్రి వీడు నా పెద్ద మనవడు ధీర్ అని చెప్పి వాడికి కూడా విభూది ఇవ్వమ్మ అని చెప్తుంది..
దానితో ధాత్రి విభూది తీసుకుని ధీర్ వైపు చూసి బొట్టు పెట్టుకోండి అని చెప్తుంది..