New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 16

మిస్టర్ మాన్స్టర్ – 16

హోటల్ నుంచి బయటకు వచ్చిన మైరా ఏమీ మాట్లాడకుండా, గుండెల్లో ఏదో రాయి వేసినట్లుగా తండ్రి బైక్ వెనుక కూర్చుంది. 

 

ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తండ్రి ఆమెను నిశ్శబ్దంగా నగరంలోనే ఉన్న ఒక ప్రశాంతమైన పార్కుకు తీసుకెళ్లారు. 

 

చుట్టూ చెట్లు, పిల్లల అరుపులు, వృద్ధుల నడక.. కానీ మైరాకి మాత్రం చుట్టూ శూన్యం కనిపిస్తోంది.

 

రామకృష్ణ గారు మైరాను ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి, ఆమె పక్కనే కూర్చున్నారు. 

 

ఆమె ముఖం అటువైపు తిప్పుకుని ఉంది. ఆమె భుజంపై చేయి వేసి, మైరా నా వైపు చూడు అని మెల్లగా పిలిచారు. 

 

మైరా తిరగలేదు. ఆమెకు లోపల కోపం, బాధ, భయం అన్నీ ఒకేసారి ఉప్పెనలా వస్తున్నాయి.మైరా.. నేను ఏం చేసినా నీ మంచికే కదా నీకు పెళ్లి సంబంధం చూశానంటే, అది నా బాధ్యత అని కాదా ఆ అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue