కనకదుర్గ అమ్మవారి దర్శనం ముగించుకుని, ఆలయ ప్రాంగణంలోనే ఆ వృద్ధాశ్రమానికి,
అన్నదాన ట్రస్ట్‌కు భారీ విరాళాలు ఇచ్చి తన రేంజ్ ఏంటో చూపించిన తర్వాత, ఇషాంత్ మరియు మైరా ఇద్దరూ కలిసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు.
ఆ రోజంతా ప్రయాణపు అలసట, గుడిలో నడక వల్ల ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా భోజనం చేసి ఇల్లంతటా ఆవరించిన నిశ్శబ్దంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
మైరా తల్లిదండ్రులు రామకృష్ణ గారు, పద్మ గారు కూడా తమ అల్లుడు కూతురిని ఎంత ప్రాణంగా చూసుకుంటున్నాడో,
తమ పుట్టిన ఊరిలోనే తమ ఇద్దరి పేరు మీద ఎంత గొప్పగా సేవా కార్యక్రమాలు చేయించాడో తలుచుకుని ఎంతో సంతోషంగా మురిసిపోతూ పడుకున్నారు.
ఆ రాత్రి అంతా ఎంతో సాఫీగా గడిచిపోయింది. ఇషాంత్ మనసులో మైరా ఫ్రెండ్స్ గురించి ఉన్న ఆ చిన్నపాటి వెలితి,