New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 5

మిస్టర్ మాన్స్టర్ – 5

మైరా కూడా ఆ షాక్‌తో కింద పడబోయి, ఇషాంత్ షర్ట్ కాలర్‌ని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ఇషాంత్ వేసుకున్న లక్షల విలువైన బ్రాండెడ్ సూట్ నలిగిపోయింది. 

 

చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, దిలీప్ అందరూ నిర్ఘాంతపోయారు.వైజాగ్ నగరంలో ఇషాంత్ భూపతి రాజుని తాకే ధైర్యం కూడా ఎవరూ చేయరు.

 

అటువంటిది ఒక సామాన్యమైన అమ్మాయి వచ్చి అతన్ని బలంగా ఢీకొట్టడమే కాకుండా, అతని కాలర్‌ని పట్టుకోవడం చూసి అందరి గుండెలు ఆగిపోయినంత పని అయింది.

 

మైరా ఊపిరి పీల్చుకుంటూ తల పైకెత్తింది. తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ ఆరడుగుల మృగాన్ని చూసి ఒక్క నిమిషం గాలి ఆగిపోయినట్లు అనిపించింది. 

 

అతని కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. కోపం నషాళానికి అంటుతోంది.చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ – కీర్తి, స్నేహ, వంశీ అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. 

 

మైరా.. ఏం చేశావే అని వాళ్ళ మనసులో వణుకు మొదలైంది.ఇషాంత్ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. అతని చూపులో చంపేంత కోపం ఉంది. 

 

మైరా చేతులు వణుకుతున్నాయి కానీ, ఆమె అతని కాలర్‌ని వదల్లేదు. ఇషాంత్ తన పళ్ళను నూరుతూ, ఆమె చేతిని విదిలించడానికి ప్రయత్నించాడు.

 

మాల్ మెయిన్ ఎంట్రీ దగ్గర నిశ్శబ్దం ఆవహించింది. ఏసీ గాలి వస్తున్నా అందరికీ చెమటలు పడుతున్నాయి. భూపతి ఇండస్ట్రీస్ సీఈఓని ఎదురు వచ్చిన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి.

 

ఇషాంత్ అహంకారం దెబ్బతింటే అతను మాన్స్టర్ లా ఎలా మారతాడు,మైరా కళ్లలో భయం ఉన్నా, తన తప్పు లేదని నిలదీయాలని చూస్తోంది.

 

ఇషాంత్ తన చేయిని మైరా వైపు నెమ్మదిగా చాచాడు.మాల్ ఎంట్రీ దగ్గర కాలం స్తంభించిపోయింది. ఇషాంత్ భూపతి రాజు గుండెలకి బలంగా తగిలిన మైరా, ఒక్క క్షణం తేరుకోలేకపోయింది.

 

ఆమె పట్టుకున్న ఆ లక్షల విలువైన బ్రాండెడ్ సూట్ ఆమె చేతి వేళ్ల మధ్య నలిగిపోతోంది. ఇషాంత్ కళ్లలో పుట్టిన ఆ కోపాగ్ని మైరాను దహించేలా ఉంది. 

 

దిలీప్ మరియు బాడీగార్డ్స్ కళ్లు పెద్దవి చేసి చూస్తున్నారు. భూపతి ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేతను ఒక సామాన్య అమ్మాయి ఇలా ఢీకొట్టడం అనేది వారి ఊహకందని విషయం.

 

మైరా తన తల పైకెత్తి ఇషాంత్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో కనిపిస్తున్నది మనిషి కాదు, ఒక రకమైన క్రూరత్వం. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.

 

మైరా తన తప్పు తెలుసుకుని వెంటనే అతని కాలర్‌ని వదిలేసింది. ఆమె గొంతులో భయం ఉన్నా, అది మర్యాదపూర్వకమైన భయం.

 

అయ్యో సారీ సారీ అండి.. నిజంగా చూసుకోలేదు. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ వేగంగా వచ్చేసాను.. ఏమీ అనుకోవద్దు. దెబ్బేమీ తగల్లేదు కదా అని గబగబా చెప్పేసింది.

 

ఇషాంత్ ఏదో అనడానికి తన నోరు తెరిచాడు. అతని గొంతులో నుంచి ఒక గర్జన రాబోతోంది. తన ఆస్తి, తన హోదా, తన అహంకారం దెబ్బతిన్నాయని అతను అరిచి చెప్దామనుకున్నాడు. 

 

కానీ మైరా అతని మాట వినే స్థితిలో లేదు.వస్తానండి సారీ వన్స్ అగైన్ అని చెప్పి, వెనకాల నిలబడి వణికిపోతున్న తన ఫ్రెండ్స్ 

 

-కీర్తి, స్నేహ, వంశీలను చేయి పట్టుకుని లాక్కుంటూ మాల్ లోపలికి పరుగున వెళ్ళిపోయింది.ఒక్క సెకనులో అక్కడ అంతా మారిపోయింది.

 

ఇషాంత్ కళ్ళ ముందు నుంచి ఆ అమ్మాయి ఒక మెరుపులా మాయమైపోయింది. ఇషాంత్ అలాగే నిలబడిపోయాడు. 

 

తన కోటు నలిగిపోయింది, తన ఫోన్ కింద పడి స్క్రీన్ పగిలిపోయింది. అంతకంటే ఎక్కువగా అతని మనసులోని అహంకారం ముక్కలైపోయింది.

 

దిలీప్ అని అరిచాడు ఇషాంత్. ఆ అరుపుకి మాల్ బయట ఉన్న పావురాలు కూడా భయంతో ఎగిరిపోయాయి.

 

దిలీప్ పరుగున వచ్చి వంగాడు. చెప్పండి సర్ 

ఎవరా అమ్మాయి నా దారికి అడ్డు వచ్చి నా షర్ట్ పట్టుకుని.. 

 

సారీ అని చెప్పి వెళ్ళిపోతుందా.అసలు ఆమెకు ఎంత ధైర్యం, సెక్యూరిటీని పిలువు,మాల్ గేట్లు మూసేయండి. ఆ అమ్మాయిని ఇప్పుడే నా కాళ్ల దగ్గరకు తీసుకురండి.

 

ఆమెను ఎలా శిక్షించాలో నాకు తెలుసు అని కోపంతో ఊగిపోయాడు.సెక్యూరిటీ హెడ్ పరుగున వచ్చాడు. ఇషాంత్ అతన్ని చూసి,నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు .

 

నా కళ్ల ముందు జరిగిన దానికి నువ్వు సాక్షివా లేక నా సెక్యూరిటీవా? ఆ అమ్మాయిని పట్టుకోకపోతే నీ ఉద్యోగం ఈ క్షణమే ఊడిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు.

 

సెక్యూరిటీ వారు లోపలికి వెళ్లబోయారు.సరిగ్గా అదే సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు కానీ, వైజాగ్ లోని మెయిన్ మీడియా ఛానల్స్ బండ్లు అన్నీ మాల్ మెయిన్ గేటు దగ్గర వచ్చి ఆగాయి.

 

కెమెరాలు, మైకులు ఒక్కసారిగా బయటకి వచ్చాయి.

సర్ ఇషాంత్ గారు.. వైజాగ్‌లో కొత్త ప్రాజెక్ట్ గురించి మీ నిర్ణయం ఏంటి,

 

భూపతి ఇండస్ట్రీస్ వైజాగ్ లో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.

 

ఇషాంత్ కి మీడియా అంటే అసహ్యం, కానీ తన కంపెనీ రెప్యుటేషన్ కోసం అతను వాళ్ళ ముందు పద్ధతిగా ఉండాలి…..

 

                        కొనసాగుతోంది…..

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్….