తెల్లవారుజామున మూడు గంటల సమయం. వర్మస్ ఎంపైర్ బంగ్లా చుట్టూ మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంది.
కానీ లోపల మాత్రం రణ్వీర్ సామ్రాట్ గుండెల్లో ఆందోళన సుడిగుండంలా తిరుగుతోంది. నలుపు రంగు సూట్ ధరించి,
తన రిస్ట్ వాచ్ చూసుకుంటూ హాలులో అటు ఇటు నడుస్తున్నాడు. బయట రఘు తన మనుషులతో కలిసి మూడు బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ ఎస్‌యూవీలను సిద్ధం చేసి ఉంచాడు.
సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అత్యాధునిక ఆయుధాలతో అప్రమత్తంగా ఉన్నారు. రణ్వీర్ కళ్లు పదే పదే మెట్ల వైపు చూస్తున్నాయి.
నాలుగు గంటలకి తను ఇక్కడ ఉండాలి.. లేదంటే తన తండ్రి లైఫ్ నాశనం అయిపోతుందన్న భయంతోనైనా అన్విక వస్తుందని రణ్వీర్ ఆశ.
సమయం 3:55 అయింది. ఇంకా అన్విక జాడ లేదు. రణ్వీర్ దవడలు బిగుసుకుపోయాయి. తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు, కానీ అన్విక తనను ప్రతి క్షణం పరీక్షిస్తోంది.