అమెరికా పర్యటన ముగించుకుని, రణ్వీర్ సామ్రాట్ మరియు అన్విక ఇండియాలోని తమ రాజభవనం వంటి నివాసానికి చేరుకున్నారు.
వర్మస్ ఎంపైర్ బంగ్లా అడుగుపెట్టగానే ఆ గాలిలో ఒక రకమైన ప్రశాంతత, సుగంధ ద్రవ్యాల వాసన వారిని స్వాగతించాయి.
ఇన్నాళ్లూ విదేశాల్లోని ఆ రొద, శత్రువుల భయం, ప్రాణాల మీదకు వచ్చే పోరాటాల నుండి బయటపడిన అన్వికకు ఈ క్షణం ఒక ఊరటలా అనిపించింది.
కానీ, రణ్వీర్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అతను అడుగుపెట్టగానే తన సామ్రాజ్యంపై తన పట్టును మళ్ళీ ఎలా బిగించాలో అనే ఆలోచనల్లో మునిగిపోయాడు.
బంగ్లా లోపలికి రాగానే, రన్వీర్ తల్లి, అన్వికను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.
ఆ ఇల్లు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. అన్వికను చూసి ఆమె కళ్లలో ఒక తృప్తి కనిపిస్తోంది. ఆమె తన కోడలిని ఇలా అంటుంది.