ఆఫీసులో జరిగిన ఆ భయంకరమైన గొడవ తర్వాత, రణ్వీర్ క్యాబిన్ లో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది.
కానీ అది ప్రశాంతత కాదు, తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం. అన్విక తన చేతులతో రణ్వీర్ కి టిఫిన్ తినిపిస్తుంటే, రణ్వీర్ కళ్ళలో మాత్రం ఇంకా ఆ కోపం పోలేదు.
రణ్వీర్ గారు, చాలు ఇక శాంతించండి. నాకు కాలేజీకి టైమ్ అవుతోంది అని అన్విక మెల్లగా చెప్పడంతో రణ్వీర్ లోకంలోకి వచ్చాడు.
సరే అన్వీ.. పద నేను కూడా బయట వరకు వస్తాను అని అన్విక చేయి పట్టుకుని క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు.
బయట అనిత, రాహుల్ అప్పటికే ఎదురుచూస్తున్నారు. రణ్వీర్ తన తమ్ముడు, చెల్లి దగ్గరికి వెళ్లి గంభీరంగా ఇలా అన్నాడు…..
రాహుల్! అనిత! అన్విక బాధ్యత మీది. కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర నుండి తిరిగి కారు ఎక్కే వరకు తను మీ కళ్ళ ముందే ఉండాలి.