రణ్వీర్-అన్వికల మధ్య ఉన్న ఆ చిన్నపాటి యుద్ధం ముగిసి, ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి.
రణ్వీర్ గాయం పూర్తిగా మానలేదు. వెన్ను మీద ఆ పెద్ద కట్టు ఇంకా అలాగే ఉంది. రణ్వీర్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చి అన్వికను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాడు కానీ,
తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నా అన్వికకు ఈ వస్తువులు, నగలు ఏమీ అక్కర్లేదు.. తనకి కావాల్సింది కేవలం నా సమయం, నా ప్రేమ మాత్రమే అని అర్థం చేసుకున్నాడు.
ఆ రోజంతా అన్విక రణ్వీర్ పక్కన నుండి ఒక్క క్షణం కూడా కదలలేదు. రణ్వీర్ నిద్రపోతున్నప్పుడు కూడా గాయానికి ఏ ఇబ్బంది లేకుండా,
తన నిద్ర భంగం కాకుండా నైట్ అంతా చూసుకుంటూ ఆయన నుదుటిపై తల నిమురుతూ ఉండిపోయింది.
రణ్వీర్ కళ్లు తెరిచిన ప్రతిసారీ అన్విక దేవతలా అతని ముందే కనిపిస్తోంది.