వేద్ వేద దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని సారీ రౌడీ.తప్పు అయిపోయింది ఇంకా ఎప్పుడు ఇలా ఓవర్ గా రియాక్ట్ అవ్వను సారీ బేబీ ప్లీజ్ ఎస్క్యూజ్ చెయ్.
వేద సీరియస్ అయ్యి కాళ్ళు వెనక్కి లాక్కుని నాకు ప్రేమ నిజం కాదు అన్నావ్, నీ ప్రేమ మీద నమ్మకం లేదు అన్నావ్ కదా అలాగే ఉండు వేదన్ష్ అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వేద.
వేద్ కి అర్థం అయ్యింది డీప్ గా హర్ట్ అయ్యింది అని అక్కడే తల పట్టుకుని కూర్చో ఉంటాడు వేద్.
వేద ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని కిందకి వెళ్తుంది.
నేరుగా కిచెన్ లో కి వెళ్లి మాగి ప్రేపరషన్ లో పడిపోతుంది. మాగి చేసుకుని కోక్ ఒకటి తీసుకుని లాప్టాప్ కుడా తీసుకుని టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడే తినేసి క్లెయింట్ తో మీటింగ్ ఉంటే లాప్టాప్ లో మాట్లాడుతూ ఉంటుంది.