New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వన్ నైట్ స్టాండ్💘4

వన్ నైట్ స్టాండ్💘4

వన్ నైట్ స్టాండ్ 💘4

 

 

ఆగమనం…..

 

 

 

 

అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్య రాశి అని అయితే చెప్పలేము..

 

బట్ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా.. అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.

 

 

తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాను అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా అని తనకేసి పట్టుకొని అటు ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.

 

 

 

 

మీకు ఈ కలర్ చాలా బాగా నప్పింది మేడం. చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు అని సేల్స్ గర్ల్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో 

 

తనకి ఒక అందమైన స్మైల్ ఇచ్చి  ఇది నాకు బాగా సెట్ అయిందా అని అడిగింది.

 

 

ఎస్ మ్యామ్ చాలా బాగుంది.

 

 

ఉమ్మ.. పెదవులు రౌండ్ గా ముడిచి అద్దంలో తనకు తానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంది.

 

 

ఆ అమ్మాయి ఆనందం చూసి సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతు ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది అని ఫిక్స్ అయ్యింది ఫుల్ కాన్ఫిడెంట్ తో.

 

 

 

బట్ ఒక లెహంగా మాత్రమే అయితే ఎలా అని తెలివిగా ఆలోచించిన సేల్స్ గర్ల్ బట్ మామ్ ఇది మీకు చాలా బాగుంది మరి వాటి గురించి ఏమనుకుంటున్నారు అని అంతకు ముందు చెక్ చేసుకుని  పక్కన పెట్టేసిన మరో లెహంగా వైపుకి చూపిస్తుంది.

 

 

ఇందాక అది బాగుంది అని చెప్పావు ఇప్పుడు దాని కన్నా ఇది బాగుంది అని చెప్తున్నావు రెండిట్లో ఏది బాగుంది అని సేల్స్ గర్ల్ తెలివికి గంటు పెట్టింది సొట్ట బుగ్గల సుందరి.

 

 

అలా అడగడంతో బ్రైట్ గా వెలిగిపోతున్న సేల్స్ గర్ల్ ముఖం లైట్ గా డిమ్ అయింది.

 

 

బట్ చెరగని చిరునవ్వు సేల్స్ గర్ల్స్ సొంతం కద అదే నవ్వు మైంటైన్ చేస్తూ.. ఆ డ్రస్ కూడా మీకు బాగుంటుంది మేడం అంది తన ఇబ్బందిని కనబడనివ్వకుండా.

 

 

అది కూడా బాగుంటుందా అని విస్మయంగా ప్రశ్నించిన మన సుందరి ముఖం ఇంకాస్త బ్రైట్ అయింది.

 

 

 

వెంటనే హ్యాంగర్స్ నుంచి ట్రయల్ కోసమని తెచ్చిన ఇంకో డ్రెస్ తీసుకొని మరి ఇది ఎలా ఉంటుంది.

 

వీటి రెండిటి కన్నా ఇది బాగుంటుందా లేకపోతే మూడింటిలో ఏది నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని సూటిగా అడిగింది.

 

ఈసారి సేల్స్ గర్ల్ ముఖం మాత్రం నిజంగా బెడ్ లైట్ మాదిరి తయారయింది.

 

 

తన సహనానికి సాన పెడుతున్న మన సుందరిని ఏమీ అనలేక మేడం అది మీరు ఇంకా ట్రై చెయ్యలేదు కదా అని మీరు ట్రై చేశాక చూసి చెప్తాను మేడం అంది ముక్తసరిగా.

 

 

ఈసారి సేల్స్ గర్ల్ ముఖంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ కి బుగ్గ మీద సొట్ట కూడా మురిసిపోయే అంత అందంగా నవ్వింది మన సుందరి

 

 

తన నవ్వు అంత బాగున్న సేల్స్ గాల్ దానిని యాక్సెప్ట్ చేయలేని సిచువేషన్ లో ముఖం నల్లేసుకుని నిలబడితే

 

 

మిస్ టేక్ ఇట్ ఈజీ, లాఫింగ్ ఈజ్ మై హాబీ అని ఇప్పుడు సుత్తి లేకుండా సూటిగా చెప్పు ఈ మూడిట్లో ఏ డ్రెస్ నాకు బాగుంటుంది.

 

 

ఒకటే సెలెక్ట్ చేయమనడంతో సేల్స్ గర్ల్ కొంచెం అనీజీగా ఫీల్ అయ్యింది.

 

 

ఇట్స్ ఓకే బి ఫ్రెండ్లీ నీ ఆన్సర్ ఏదైనా నాకు ఓకే. బట్ బయటికి చెప్పు అంటూ ఫ్రెండ్లీ నేచర్ తో సేల్స్ గాల్ తో క్లోజ్ గా మూవ్ అవుతుంటే

 

నవ్వుతున్న ఆమె మొఖం, ఆమె ఫ్రెండ్లీ బిహేవియర్ రెండింటికి సేల్స్ గర్ల్ నార్మల్ అయ్యి చిన్నగా నవ్వింది.

 

 

 

దానితో కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య లెహంగాలా గురించి చర్చలు చాలా ఈజీగా సాగిపోతున్నాయి.

 

మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ మీకు ఒక విషయం చెప్పొచ్చా..?? అని పర్మిషన్ అడిగింది సేల్స్ గర్ల్.

 

 

హెయ్ ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా ఒకటి కాదు వంద చెప్పొచ్చు అందుకు నా పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు కమాన్ యార్ చెప్పు.

 

 

మేడం మీ ఫెయిర్నెస్ కి డార్క్ కలర్ డ్రెస్ ఏదైనా బాగుంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న మూడు కూడా డార్క్ కలర్స్ కాబట్టి దీనిలో మీకు నచ్చింది తీసుకోండి అని ఓపెన్ అయింది.

 

 

హా… హా… ఎస్, ఐ నో… థాంక్యూ డియర్..

నెక్స్ట్ ఏంటి అబ్బా?

 

చెప్పు…. చెప్పు…. చెప్పు…. అంటూ సేల్స్ గర్ల్  బుగ్గ పట్టుకుని లాగేసి మూడో డ్రెస్ తీసుకొని ట్రై వేస్తుంటే

 

 

మీకు కొంచెం హడావిడి ఎక్కువే మేడం అంది మొహమాటంగా సేల్స్ గర్ల్.

 

 

హీ…హీ…హీ…. ఇదా నువ్వు చెప్పాలనుకున్నది అని ఇదైతే నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు చాలా స్లో బట్ థాంక్యూ.

 

ఇప్పటి కన్నా తెలుసుకున్నందుకు అని నవ్వుతుంటే 

 

తనతో పాటే సేల్స్ గర్ల్ కూడా నవ్వుతూ తన డ్రస్ ట్రైల్ కి హెల్ప్ చేస్తూనే నేను చెప్పాలనుకున్నది అది కాదు మేడం అంది.

 

అది కాదా అని కళ్ళు పెద్దవి చేసి మరేంటి అని అడిగింది కనుబొమ్మలు ఎగరేస్తూ.

 

మీరు కొంచెం కాదు మేడం చాలా ఫాస్ట్ నేను చెప్పాలనుకునే లోపే మీకు మీరే ఊహించేసుకుంటున్నారు.

 

 

హో… డియర్ నేను ఫాస్ట్ కాదు, నువ్వే స్లో.  నువ్వు ఇంకా నన్ను మేడమ్ లానే ట్రీట్ చేస్తున్నావు. 

 

కమాన్ యార్ ఫ్రెండ్ లా ఉండమని చెప్పానా అని లెహంగా తన బాడీకి సెట్ చేసుకొని సేల్స్ కాల్ వైపుకు తిరిగి నవ్ సి థిస్ ఎలా ఉంది అని అడిగి వెంటనే హేయ్ నిజం మాత్రమే చెప్పాలి అంది ముద్దుగా మూతి ముడిచి.

 

 

 

ఈ కలర్ మీకు చాలా బాగుంది మేడం బట్ నిజం మాత్రమే అడిగారు కాబట్టి ఈ బ్యాటరీ మీకు సెట్ అవ్వలేదు అని క్లియర్ గా చెప్పి ఇదే కలర్ లో వేరే పాటర్న్ చూస్తారా అని అడిగింది.

 

 

సూట్ అవ్వలేదా అని ఒకసారి డల్ ఫేస్ తో మిర్రర్ లో తనని చూసుకుని వెంటనే నవ్వుతూ థాంక్యూ డియర్ నిజం చెప్పినందుకు అంటూ సేల్స్ గర్ల్ బుగ్గ లాగి ఆ వేళ్ళను కిస్ చేసింది.

 

 

 

మేడం, మీరు భలేవారు మేడం బాగోలేదన్న, హ్యాపీగా బుగ్గ లాగేస్తున్నారు. కానీ మీరు ఎందుకు మేడం? ఇటువంటి డిజైన్స్, చూస్ చేసుకుంటున్నారు. 

 

 

మీరు సూపర్ మేడం బాగోలేదని చెబితే కష్టమర్స్ ఫీల్ అవుతారని మేము త్వరగా నిజం చెప్పం మేడం బట్ మీరు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నిజం చెప్తున్నాను.

 

మీకు ఈ కలర్స్ అన్ని బాగున్నాయి బట్ ఈ డిజైన్ సేవి మీకు సూట్ అవ్వవు మేడం అంది మొహమాటం లేకుండా.

 

మన సుందరి భూమికి 5 అడుగులే ఉంది. బట్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి లేహంగా హెవీ అండ్ బిగ్ డిజైన్స్ తో గ్రాండ్ గా ఉన్నాయి.

 

చూడడానికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కానీ మన సుందరికి ఆ పెద్దపెద్ద డిజైన్స్ అస్సలు సెట్ కాలేదు.

 

 

యా ఐ నో అని పెదవి విరిచి నీకు ఒక విషయం చెప్పనా?? నాకు ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ అన్న, పెద్దగా ఉండేవి అన్న భలే ఇష్టం.

 

షార్ట్ గా ఉండే వాళ్ళన్న, షార్ట్ పీరియడ్ అన్న నాకు అస్సలు నచ్చదు. నాకు అన్ని ఇలాగే ఆపోజిట్ లో నచ్చుతాయి.

 

 

 

ఈవిడ సెలక్షన్ ఇలా ఉందేంటి అబ్బా అని సేల్స్ గర్ల్స్ కొంచెం క్రేజీగా చూసింది మన సుందరిని.

 

 

సేల్స్ గర్ల్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి ఒక స్మైల్ ఇచ్చి వాల్ మిర్రర్ నుంచి రెండు అడుగులు వెనక్కి వెళ్లి ఆ లెహంగాలో తనని అద్దంలో చూసుకుంటుంది.

 

 

 

తనని తాను అద్దంలో చూసుకుంటున్న ఆమె కళ్ళు సడన్ గా డైరెక్షన్ మారి ఆమెను కాకుండా అద్దంలో కనిపిస్తున్న మరొక ప్రతిబింబం మీద నిలిచాయి.

 

ఆమె ఆ ప్రతిబింబం కట్టిపడేసే సరికి అలా నోరు వెళ్ళబెట్టి మరి మైమరిచిపోయి చూస్తుంది. 

 

అది నీదే అని చెబుతున్నట్టు క్షణాలలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.

 

ఆమె అసలు కనురెప్ప వేయడం లేదు. 

 

ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. 

 

అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్ ఆమె చూపులు ఆ ప్రతిబింబానికి అతుక్కుపోయాయి.

 

 

 

W…O…W..,.. అని ఆమె గుండె ఆమెకు చెబుతుంది.

 

గంట కొడుతున్న తన గుండె మీద చేయి పెట్టుకుని నీకు కావాలా..?? అని ప్రశ్నించుకొని

 

 

తన ప్రశ్నతో మరింత వేగం పెరిగిన గుండెచప్పుడుకి.. ఎస్ యు ఆర్ రైట్. హి ఇస్ వావ్…..వ్ అని ఫిక్సయింది.

 

ఏమి, ఉన్నావురా..???

 

 

 

 

@@@@@@@@@

 

 

ఇంతకీ ఎవరబ్బా..???

 

 

థాంక్యూ సో మచ్.

వర్ణ.