New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వన్ నైట్ స్టాండ్💘 – 3

వన్ నైట్ స్టాండ్💘 – 3

వన్ నైట్ స్టాండ్ 💘3
….
ఆగమనం….
ఇంత హడావిడిలో  నీ మీద నేను నిఘా వేయడం అని చుట్టూ ఉన్న హడావిడి చూపిస్తూ అదే చెదరని నవ్వుతో నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, 
దా.. దా.. వెళ్దాం అర్జెంట్ అని తమ్ముడి చేయి పట్టుకొని లాక్కెలుతుంటే ఎక్కడికి ఏంటని అడుగుతున్న చెబుతా రా అంటూ అలాగే కార్ దగ్గరికి లాక్కొచ్చింది.
అక్క ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చిన్న పిల్లాడి ని చేసి నాతో ఆడేసుకుంటున్నావు. ముందు చెప్పు అక్క అని విసుక్కుంటూ చెయ్యి వదిలించుకుంటాడు మన హీరో.
చిన్న పిల్లడిని అన్నందుకు తమ్ముడుని  పైనుంచి కిందకు చూసిన ఆమే నవ్వుతూ నా తమ్ముడు నాకెప్పుడూ చిన్న పిల్లాడే. 
నీతో కాక ఇంకెవరితో ఆడుకున్న ఈ హ్యాపీనెస్ ఉండదు అని పద పద బట్టల షాప్ కి త్వరగా వెళ్లి రావాలి అంది హడావిడి చేస్తూ.
బట్టల షాప్ అనేటప్పటికి ఆశ్చర్యంతో కూడిన అసహనం అతనిలో.
పెళ్లి అనుకున్నప్పటి నుంచి మనిషికి విశ్రాంతి అనేది లేకుండా మిషన్ లా అన్ని మీదేసుకొని చేస్తూనే ఉంది.
బట్టల షాప్ కా..??
ఇప్పుడా..??
ఎందుకు అక్క అని వరుసగా ప్రశ్నిస్తున్న మన హీరోకి విసుగ్గా ఉంది చెల్లి తో పాటు పెళ్లి మండపానికి వెళ్ళవలసిన దగ్గరకు వస్తుంటే ఈ టైంలో బట్టల షాప్ కి వెళ్లడం ఏంటని.
బట్టల షాప్ కి ఎందుకు వెళ్తారు రా?? బట్టలు తెచ్చుకోవడానికి. టైం వేస్ట్ చేయకు, మళ్లీ తొందరగా వచ్చేయాలి రా అంటూ కార్ దగ్గరికి వచ్చి నిలబడి తమ్ముడిని కూడా రమ్మన్నట్టు చూసింది.
బట్టల షాప్ కి బట్టల కోసం కాకుండా బంగారం కోసం వెళతారా అక్క అని ప్రస్టేట్ అవుతూ ఏం కొనడానికి అని అడగడం లేదు ఈ టైంలో ఏంటని అడుగుతున్న అన్నాడు.
ఈమధ్య బట్టల షాపుల్లో బంగారం కూడా అమ్ముతున్నారు.  మనం వెళ్లే షాప్ లోనే లేదు. నీకు కావాలంటే చెప్పు మరో షాప్ కి వెళ్దాం అని నవ్వింది.
జోక్స్  ఆపక్క.. ఫన్నీ గా ఉందేమో నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇంత హడావిడిలో ఇప్పుడు షాప్ కి ఎందుకు, అంత అర్జెంటు ఏంటి అని సీరియస్ అవుతూనే కార్ దగ్గరికి వచ్చి అక్క వైపు గుర్రుగా చూస్తున్నాడు.
తమ్ముడు కోపం పాలపొంగు లాంటిదని తనకు తెలుసు.
మన హీరో చెంప మీద చిన్నగా తట్టి నిలబడే అన్ని చెప్పాలా? 
ముందు స్టార్ట్ చెయ్. వెళ్తూ తిరిగ్గా డిస్కస్ చేద్దామని తమ్ముడు ని కూడా కార్ ఎక్కమంటూ తన సైడ్ డోర్ తీసుకొని ఎక్కి కూర్చుంది.
ఉఫ్.. పిచ్చ కోపం వస్తుంది అయినా నా కోపంతో నీకు పని లేదు. ఎంతసేపు పని పని అని పరిగెత్తుతావ్ అంటూ గొనుగుతూనే డ్రైవింగ్ సీట్ అలంకరించాడు మన హీరో.
అసలు మీ ఆడవాళ్లు ఉన్నారు చూడు ఎంత షాపింగ్ చేసినా ఇంకా షాపింగ్ షాపింగ్ అంటూ ఏడిపించేస్తారు. 
అసలు బోర్ కొట్టదా మీకు, ఏం కొంటారు అక్కా అంతంత. గంటలు గంటలు షాపింగ్ అని నన్ను తిప్పి తిప్పి చంపుతున్నావు అన్నాడు.
నిన్ను ఎడిపించడం నాకు సరదా రా.  పెళ్లి అన్నాక, సవ లక్ష ఉంటాయి. చెబుతాను కానీ, ముందు కార్ స్టార్ట్ చెయ్యి రా.
నీతో ఏదైనా పని పెట్టుకుంటే ప్రతి చిన్న పని నేనే చెప్పి చేయించుకో అని చిరు కోపంతో గదమయించే వలసి వచ్చేసరికి ఇక తప్పదని కార్ స్టార్ట్ చేసాడు మన హీరో.
కార్ రోడ్డు ఎక్కే సరికి తమ్ముడితో ఇప్పుడు షాపింగ్ వెళుతున్న రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసింది తను.
ఆ రీజన్ విన్న మన హీరోకి మాత్రం ఇంకొంచెం కోపం పెరిగింది.
రాత్రికి పెళ్లి, నువ్వు చెల్లి దగ్గరే ఉండాలి. కానీ ఇప్పుడు హడావిడి హడావిడిగా బయటకు వస్తున్నాం. ప్రతి సారి ఇలా పరిగెత్తడం అంటే, కష్టమైపోతుంది అని సీరియస్ అయ్యాడు.
కష్టమేరా ఈ ఒక్కసారి మా అమ్మ కదా అని తమ్ముడు గడ్డం పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంటే 
ఆహ్ ఏంటక్కా నువ్వు అని అక్క చేతిని తోసేసి కూర్చుని డ్రైవ్ చేసే నాకు కష్టమే ఉంటుంది నీ పిచ్చి గాని నేను చెప్పేది నీ గురించి అన్నాడు చిట్లించిన ముఖంతో.
మన ఇంటి పెళ్లి కష్టం అనుకుంటే ఎలా? అని ఏదో ఒకటి రెండు అవసరం ఉన్నాయని అమ్మ మళ్ళీ చెప్పింది అంది చిరునవ్వుతో తన సైడ్ సమర్ధించుకుంటు.
నువ్వు చెప్పినంత ఈజీ కాదు. మన బ్యాచ్ సంగతి నాకు తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. మళ్ళీ మళ్ళీ అన్నిటికి నువ్వే పరిగెడతావు .
నాకు తిరగడం కష్టం కాదు తిరిగి తిరిగి నువ్వు అలిసిపోతున్నవు చూడు అదే నాకు నచ్చడం లేదని మన హీరో సీరియస్ అవుతుంటే తన మీద ఉన్న ప్రేమకే ఓ పక్కన ఇష్టంగా తమ్ముడిని చూస్తూనే అతని కోపానికి కొంచెం ఫీల్ అవుతుంది ప్రమోద.
మళ్లీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగడం అమ్మ పిలిచి నీకే చెప్పడం ఇదంతా నావల్ల కాదు గాని అత్తకి ఒకసారి ఫోన్ చెయ్. బ్యాచ్ మొత్తానికి హెడ్ ఆవిడే కదా ఏమేమి కావాలో ఒకేసారి చెక్ చేసుకుని చెప్పమను అన్నాడు ఆర్డర్ వేసినట్టే.
తమ్ముడి కోపానికి, చిరాకు కి చిన్నగా స్మైల్ ఇచ్చి ప్రమోద ఇంటికి ఫోన్ చేసి ఎందుకురా నీకు అంత చిరాకు?? 
మనింటి పెళ్లి మనమే కదా చూసుకోవాలి. దీనికి, చిరాకు పడితే ఎలా రా తమ్ముడి బుగ్గలు లాగి వదిలే సరికి లాగిన బుగ్గ మీద చేయి పెట్టుకొని గుర్రుగా చూస్తున్నాడు అక్క వైపు.
మా బుజ్జి తమ్ముడికి కోపమా అంటుంటే..
అక్క కోపం అని అంత చిన్నగా తీసిపడేకు నాకు చాలా తిక్క తిక్కగా ఉంది. అన్నిటికి ఒక్కదానివే తిరుగుతున్నావు. అయినా ఆరోజే చూసుకోవచ్చు కద అంతా తానై కష్టపడుతున్న అక్క మీద ప్రేమతోనే కోపం చూపిస్తున్నాడు.
తమ్ముడు అలా అనకురా. ఆరోజు నాది మిస్టేక్ నేనే ప్రొపెర్ గా చెక్ చేసుకోలేదని చెబుతుంటే
ఆపు అక్క అని గద్దించాడు.
తప్పు తనదే అని ప్రమోద చెప్తుంటే ఆ మాట వినడమే నచ్చలేదు మన హీరోకి. 
అక్క అంటే అంత ప్రేమ మరి.
ఆరోజు నీతో పాటు చాలామంది ఉన్నారక్క. అన్ని నీ నెత్తి మీద వేసుకోకు. నాకు నచ్చదని తెలిసి కూడ, నువ్వు ఇలా మాట్లాడితే, నాకు కోపం వస్తుంది.
అప్పుడు నేనే డైరెక్ట్ కావాలి అందరికీ చెప్తాను ఎవరికి కావలసినవి వాళ్ళు వెళ్లి తెచ్చుకోమని. ఆ తర్వాత నీ ఇష్టం అని అరుస్తుంటే
అటు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన సదరు మెనత్త హలో.. ఏంటే ఫోన్ చేసావు అని అడగడంతో
ఇంకా ఆపరా బాబు, నువ్వు నీ అరుపులు అని విసుక్కుంటూ తమ్ముడు నెత్తి మీద ఒక్కటి వేసి
హలో అత్త అంటూ మాట్లాడటం మొదలు పెట్టింది.
ఆ తల్లి నేనే, ఏంటే ఆ అరుపులు? పక్కన వాడేనా అలా అరుస్తుంది. త ఇంకా వెళ్లలేదా అని అడిగింది ఫోన్లో కూడా స్పష్టంగా వినిపిస్తున్న మన హీరో అరుపులతో.
హా  అత్త వాడే. వాడు కాస్త చిరాకులో ఉన్నాడులే అని సైలెంట్ గా ఉండమని నోటి మీద వేలు పెట్టి కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేస్తూనే ముందు నేను చెప్పేది విను అత్త అంది.
సరే తల్లి, చెప్పు అంది ఆవిడ.
అత్త బట్టల షాప్ కనీ బయటకు వచ్చాము. ఒకసారి అందరూ మాట్లాడుకొని ఇంకేమన్నా అవసరం అవుతాయేమో కనుక్కొని చెప్పత్త. 
మళ్లీ పెళ్లి టయానికి ఏదైనా అవసరమైతే ఇబ్బంది అవుతుంది అనే ఒకేసారి తీసుకొచ్చేస్తాను అని చెబితే
ఒసేయ్ ఈ విషయం నేను కనుక్కొని చెబుతాను గాని మీ పెద్ద మామయ్య వాళ్ళు, వస్తున్నామని ఇందాక ఫోన్ చేశారు.
నీకు చెప్పమని అమ్మకి చెప్పాను. ఎలాగో నువ్వు చేసావుగా, అందుకే చెప్పేస్తున్నాను వాళ్ళకి కావలసిన పెట్టుబడి బట్టలు అవి తీసుకో అని ఎవరెవరికి ఏం తీసుకోవాలి వివరంగా చెప్పింది.
ఆ సరే అత్త తీసుకుంటాను. ఇంకేమన్నా అవసరమేమో, కనుక్కొని చెప్పత్త అని అడిగింది.
హా సరే నేను కనుక్కొని ఫోన్ చేస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్లి త్వరగా వచ్చేయండి అని వాటిని కాస్త కోపం తగ్గించుకొని సరిగ్గా డ్రైవ్ చేయమని చెప్పు అంటూ ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది.
ఆ సరే అత్త చెప్తాలే అని ఆవిడని త్వరగా ఫోన్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి తమ్ముడు ముఖం చూసేసరికి అదే చిరాకు మన హీరో ఫేస్ లో.
మళ్లీ ఫ్రెష్ లిస్ట్ ఇచ్చారు కదూ అన్నాడు మొఖం గంటు పెట్టుకొని. 
ఇచ్చారులే అని నవ్వుతూ తీసుకోవలసిన లిస్ట్ గురించి చెప్పింది.
అన్నిటికీ నవ్వుతూ సమర్ధించడం నీకు బాగా అలవాటైందని కస్సు బుస్సు లాడుతూనే బట్టల షాప్ పార్కింగ్లో కార్ ఆపాడు.
నువ్వు లేడీస్ సెక్షన్ కి వెళ్లి కావాల్సిన తీసుకో జెంట్స్ సెక్షన్ నేను మేనేజ్ చేస్తాను అన్నాడు త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్లడానికని.
మార్నింగ్ టైం కావడంతో షాప్ లో కూడా అంతా రష్ లేకపోవడంతో నేను ఫస్ట్ పైకి వెళ్లి సారీస్ చూసుకొని వస్తాను ఈలోపు నువ్వు ఇక్కడ పెదనాన్న పిల్లలకి టీడీపీ ఏమైనా తీసుకో అంటూ ప్రమోద పైకి వెళ్ళింది.
ఆ ఫ్లోర్ మొత్తం రెడీమేడ్ సెక్షన్. 
ఒక సైడ్ జెంట్స్ కి, మరొక సైడ్ లేడీస్ కి.
లేడీస్ వి వెళ్లచని ఫస్ట్ జెంట్స్ సెక్షన్ వైపుకు వెళ్ళాడు మన హీరో.
ఆ ఫ్లోర్ లోనే లేడీస్ సెక్షన్లో లాంగ్ వాల్ మిర్రర్ ముందు నిలబడి ఉంది ఒక అమ్మాయి. 
అయిదు అడుగుల ఒక్క అంగుళం ఎత్తు.
గుండ్రటి మొఖం, చక్కగా తీర్చిదిద్దినట్టు ఉన్న రూపం.
తెల్లటి మేని చాయతో ఆకట్టుకునే ముఖ వర్చస్సు. 
నవ్వుకి నాజూకుగా వికసిస్తున్న గులాబీ రేకులు లాంటి పెదవులు. 
ఆ చిన్ని నవ్వుకె చోట్టతో మురిపించే బుగ్గలు. 
నవ్వినప్పుడు మెరుస్తున్న ఆ కళ్ళల్లోనే సంతోషమంతా ఉందా అన్నట్టు వెలుగుతుంటే 
ఆ వెలుగుల కింద తలుక్కుమంటున్న తెల్ల రంగు రాయి ముక్కు పుడక.
అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము..
బట్ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా.. అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.
తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాను అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా అని తనకేసి పట్టుకొని అటు ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.
@@@@@@@@@
థాంక్యూ సో మచ్.
వర్ణ.