ధరణి మనోజ్ కి ఎప్పుడు ఫోన్ చేయాలి అని తెగ ఆలోచిస్తూ ఉంది…..
సాయంత్రం ఐదు గంటల సమయంలో
“అత్తయ్య నేను వెళ్లి గార్డెన్ లో మెుక్కలకు నీళ్లు పోసి వస్తాను ” అని చెప్పి బయటికి వెళుతుంది.కాసేపు మెుక్కలకు నీళ్లు పోసి, అక్కడే కాసేపు గార్డెన్ లో తిరిగి లోపలికి వస్తుంది….
“ధరణి , ఇప్పుడు అభి వచ్చిన తరువాత అడుగుతాను , వాడు ఎందుకు నీ మీద చేయి చేసుకున్నాడు అని, ఏమని సమాధానం చెప్తాడో చూద్దాం ” అని అంటారు……