వైదేహి తల రుద్దుకుంటూ విక్కీ వైపు చూస్తూ తిరిగి తండ్రితో మాట్లాడుతూ ఉంది.
కోటేశ్వరరావు గారు కూతురు, అల్లుడు మధ్య ఉన్న బాండ్‌కి నవ్వుకొని ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు.
మన శ్రీనిక మాత్రం తన మామ, పిన్నితో ఆడుకుంటూ టైమ్ గడుపుతూ ఉంది. అసలు వాళ్ల దగ్గరికి వెళ్తే ఇంకా మిగతా ఎవరు గుర్తు రానట్టు వాళ్లతోనే ఆడుకుంటూ ఉంటుంది మన పాప.
ఆరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి విక్కీ, వైదేహి, శ్రీనిక అక్కడి నుంచి తమ ఇంటికి చేరుకున్నారు.
అదే రోజు రాత్రికి సుజాత గారు ముభావంగా ఉండడం చూసిన కోటేశ్వరరావు గారు భార్య వైపు చూస్తూ, “ఏమైంది సుజాత? నువ్వు ఏదో విషయం గురించి డీప్‌గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావ్?” అడిగారు కోటేశ్వరరావు గారు.