New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైదేహి – 25
వైదేహి Premium 10 min read

వైదేహి – 25

 

 

 

అది మరి వైదేహి, మన పాప మెచ్యూర్ అయింది. నీకు, అమ్మ, అత్తయ్య చెబుదామని అన్నారు. కానీ నేనే ఆపేశాను. ఎగ్జామ్స్ కదా, అందుకే అని అన్నాడు విక్కీ.

 

“అలా అని నా కూతురు జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యంలో నేను లేకుండా చేసేస్తావా, విక్కీ!” అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది వైదేహి.

 

విక్కీ తర్వాత ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా వైదేహి కాల్ లిఫ్ట్ చేయకుండా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది.

 

“ఏమైందిరా వైదేహి? ఎగ్జామ్ రాసేసి వచ్చి ఉంటుంది కదా! ఫోన్ చేశావా?” అడిగారు ఊర్మిళా గారు.

 

“ఎక్కడమ్మా! ఫోన్ చేశాను. చూసి ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు చూస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఏం చేస్తుందో, ఏంటో!” అన్నాడు విక్కీ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue