గత జన్మ జ్ఞాపకాలలో ఆద్వైత్ కి, ఆది, మృణాళిని ప్రేమ ఎలా ఒక అందమైన బంధంగా మారిందో తెలుస్తుంది. జాతరలో జరిగిన అనుకోని సంఘటన వాళ్లిద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. చెరువు ఒడ్డున పౌర్ణమి వెన్నెలలో ప్రేమను మాటల్లో వ్యక్తం చేసుకున్న వారు, ఎన్ని జన్మలైనా ఒకరి చేయి ఒకరు వదలమని మాట ఇచ్చుకుంటారు. ఆది తన ప్రతి భావాన్ని డైరీలో రాసుకుంటూ, మృణాళినిని తన జీవితానికి వెలుగుగా భావిస్తాడు. రోజులు గడిచేకొద్దీ వారి ప్రేమ మరింత బలపడుతుండగా, వారికి తెలియకుండానే విధి తన ఆటను ప్రారంభిస్తుంది. అదే సమయంలో పాత బంగ్లాలో రాజేంద్ర వర్మ వారి ప్రేమనే వారి బలహీనతగా మార్చాలని కుట్ర పన్నుతూ, రాబోయే విషాదానికి నాంది పలుకుతాడు.
***
కానీ…
వాళ్లకు తెలియని విషయం ఒక్కటే…
దూరంగా…
బంగ్లా రెండో అంతస్తు కిటికీ వెనుక నుంచి…
రాజేంద్ర వర్మ వాళ్లిద్దరినీ గమనిస్తున్నాడు.
అతని కళ్లలో మండుతున్న అసూయ… పెదవులపై క్రూరమైన చిరునవ్వు…