రాజేంద్ర వర్మ గతంతో ముడిపడిన జ్ఞాపకాలు ఆద్వైత్ కు తిరిగి రావడంతో, సావిత్రి దాచిన లాకెట్ భాగం బంగ్లాలోని పై అంతస్తు గదిలో ఉందని తెలుస్తుంది.
ఆ గదిలోంచి వినిపించిన స్త్రీ గొంతు, గజ్జెల శబ్దం అందరినీ భయపెట్టగా, సుబ్బమ్మ కూడా ఆ గదిలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టడానికి సిద్ధమవుతుంది.
చివరికి ఆద్వైత్ గతజన్మలో మృణాళినిని కాపాడేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తించగానే, గదిలోని తలుపు ఒక్కసారిగా ధామ్ అంటూ మూసుకుపోతుంది.
***
తలుపు మూసుకుపోయేసరికీ మృణాళిని ఉలిక్కిపడి ఆద్వైత్ చేతిని పట్టుకుంది.
అయితే ఆ తలుపు మూసుకుపోయే ముందు…
లోపల ఒక క్షణం కనిపించిన దృశ్యం అందరినీ నిశ్చేష్టులను చేసింది.
గది మధ్యలో ఒక పాత పెట్టె ఉంది.
ఆ పెట్టె మీద…