రాజేంద్ర వర్మ మృణాళిని గురించి, ఆమె మెడలో ఉన్న లాకెట్ గురించి సావిత్రిని ప్రశ్నిస్తూ, తన అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు. మృణాళిని గతం బయటపడితే ఆమెను కాపాడలేవని సావిత్రిని భయపెట్టి, చివరికి తన దగ్గరకే తీసుకొచ్చేలా చేస్తానని రాజేంద్ర వర్మ హెచ్చరిస్తాడు. మృణాళినిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్న సావిత్రి, రాజేంద్ర వర్మ కుట్రను ఎలా ఎదుర్కొంటుందో అనే ఉత్కంఠ మొదలవుతుంది.
***
సావిత్రి లో కోపం, బాధ కలిసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా సరే రెప్ప వేయకుండా రాజేంద్ర వర్మ నే చూస్తూ ఉంది.
“నేను నిన్ను ఎందుకు బెదిరిస్తాను? బెదిరిందాల్సిన అవసరం నాకేంటి? నేను చెప్పేది నిజమో కాదో నీకే తెలుసు. ఇప్పటికీ సమయం ముగించుకోలేదు ఇదే సరైన సమయం నువ్వు మృణాళిని ని తీసుకుని వచ్చి ఆ బంగ్లాలో వదిలేస్తే మీ ఇద్దరికీ మంచిది” అని చాలా ప్రశాంతంగా చెప్పాడు రాజేంద్ర వర్మ.
“లేదు.. నీ దుర్మార్గపు ఆలోచనలనే కాదు, నేను బ్రతికుండగా నా పాప పై కనీసం నీ చూపు కూడా పడనవ్వను. అలాంటిది నేను నా ప్రాణం అయిన మృణాలిని ను, నా అంతట నేను తీసుకు వచ్చి ఆ చెరసాల లాంటి ఉరికంబం మీదకి పంపినట్టుగా నువ్వు ఉన్న ఆ బంగ్లా లోకి ఎలా తీసుకు వస్తాను అనుకున్నావు? నా ప్రాణం పోయిన కూడా ఆ పని చేయను” అని కరఖాండి గా చెప్పేసింది సావిత్రి.
“అంత వరకు ఎందుకు రానిస్తా అనుకున్నావు? నీ గొంతులో ప్రాణం ఉంటుండగానే, నీ అంతట నువ్వే నీ చేతులతో ఆ చిలుకను తీసుకు వచ్చి నాకు అప్పచెప్పేలా చేస్తా గా.. చూస్తూ ఉండు, అందుకు ఎంతో సమయం కూడా పట్టదు..” అని సీరియస్ గా చెప్పి, రాజేంద్ర వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.