New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 18

ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 18

ఈ రాధాకృష్ణార్పణం ❤️
ఎపిసోడ్ – 18
నిజం చెప్పే నీడ ఎవరిది?

పాత శివాలయం ఆవరణలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

ఆ వృద్ధుడు రాధవైపు చూస్తూ అడిగాడు.

“రాధమ్మా… నీకు నిజం తెలుసుకునే హక్కు ఉంది. కానీ ఆ నిజం తెలిస్తే నీ తండ్రిని క్షమించగలవా?”

రాధ కళ్లలో అయోమయం.

“మా నాన్నను మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు మీరెవరు? మా కుటుంబానికి ఈ భూమి వివాదానికి సంబంధం ఏమిటి?”

కృష్ణ ఆమె చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడు.

“రాధా, తొందరపడకు. ఆయన చెప్పేది పూర్తిగా విందాం.”

శేఖర్ మాత్రం ఆ వృద్ధుడివైపు కోపంగా చూశాడు.

“ఇక ఆపండి! ఇన్నేళ్లుగా దాచిన విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం లేదు.”

వృద్ధుడు చిన్నగా నవ్వాడు.

“నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన అది అబద్ధం అయిపోదు, శేఖర్!”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue