అలా అని మా అన్నయ్య చెప్పాడా? నీకు??? అని శాన్వి తో రోషంగా అడిగి నేను వెళ్లి పిలుచుకు వస్తాను ఆంటీ అని బయటకి వచ్చింది కృతిక..
కృతిక ఒక్కతే బయటకి రావడంతో.. చెల్లి రాకతో శాన్వి మాములు మనిషి అయిందా లేదా చూడటానికే వచ్చిన క్రిషవ్ కి శాన్వి బయటకి రాకపోవడంతో నిరుత్సాహంగా సీట్ కి వెనక్కి ఆనుకుని తల రుద్దుకున్నాడు…
కార్ దగ్గరికి వచ్చిన కృతిక.. అన్నయ్య! గేట్ వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉండి ఫోన్ చేస్తే వాళ్లు ఏమ్ అనుకుంటారు ఇంట్లోకి రా అన్నయ్య అంది కృతిక…
ఇంటి ముందు గేట్ వరకు వచ్చిన వాడిని నీ ఫ్రెండ్ వచ్చి ఇంట్లోకి రమ్మని పిలవాలి కదా బేబీ… పిలవకుండా ఎలా వస్తారు ఇంట్లోకి అని అడిగాడు….