పెళ్లిచూపులు-85
అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అని వైష్ణవ్ కోపంగా అసహనంగా అడిగాడు. పక్కన ఉన్న విజయేంద్ర చచ్చింది గొర్రె అసలే సిరికి ఆత్మాఅభిమానం ఎక్కువ ఇలాంటి మాటలు వింటే పిచ్చి లేసిపోతుంది పగిలిపోయేటట్టుగా సమాధానం ఇస్తుంది ఇప్పుడు సిరి చెప్పే సమాధానం విని నా భార్య తట్టుకోగలదా అని మనసులో అనుకుంటున్నారు.
“ఏం మాట్లాడుతున్నారండి డబ్బు చూసి మనసులో ప్రేమ పుట్టదు, నిజానికి వైష్ణవ్ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నేను యాక్సెప్ట్ చేశాను, అంతేగాని నా అంతట నేనుగా వైష్ణవ్ అందం డబ్బు చూసి అతడి వెంట పడలేదు. అతడు వెనక డబ్బు ఉంది దర్జాగా బ్రతికేయొచ్చు అని అతడిని నుంచి నా వెంట తిప్పుకోలేదు” అని సీరియస్గా సమాధానం చెప్పింది..
అబ్బో అమ్మాయి గట్టిగానే సమాధానం చెప్తుంది ఇలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే నాకు కొంచెం కష్టమే కానీ నా కొడుకుకి భార్యగా అయితే ఓకే అని మనసులో అనుకుంటూ “హో అవునా అయితే అన్నీ తెలిసే వాడిని నీ వెంట తిప్పుకున్నావ్ అన్నమాట” అని అన్నది వరూధిని ..
“అన్ని తెలిసి వెంట తిప్పుకోవడం ఏంటండీ కొంచెం మంచిగా మాట్లాడండి నాకు తిక్క రేగింది అంటే ఎలా మాట్లాడుతాను అని నాకు తెలియదు. మీరు వైష్ణవ్ మదర్ కాబట్టి ఈమాత్రమైన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మరొకరు అయితే నా స్టైల్ లో సమాధానం చెప్పేదాన్ని” అని సీరియస్గా అన్నది సిరి.
అయిపోయింది ఇక మొత్తం అయిపోయింది నాశనం జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టే, అక్కడ సిరి ఇక తగ్గదు అమ్మ ఇలా మాటలు అంటూనే ఉంటుంది ఇక నాకు సిరికి పెళ్లి జరిగినట్టే. మేమిద్దరం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అని కలలు కన్నాను. ఆ కలలో అన్ని పెక మెడల్లా కూలిపోయాయి. ఇప్పటికే నా గురించి తెలియని కొత్త నిజం తనకు తెలిసింది అని నామీద కోపంగా ఉంది ఇంకా ఇప్పుడు అమ్మ మాటలకి పూర్తిగా నన్ను దూరం పెట్టేస్తుంది అని మనసులో అనుకున్నాడు. కానీ తన తల్లిని మాత్రం ఏ మాట మాట్లాడనివ్వకుండా ఆపలేకపోయాడు.