నా బావ 10 వ భాగం…
రమణి పదిమందిలో ఏంటిది. నీ ఇష్టమేదో నువ్వు చెప్పావు వాడు అభిప్రాయం వాడు చెప్పాడు.
ఇక్కడి వరకు వచ్చాక ఇప్పుడు మాట్లాడుతున్నావు.
నీ కళ్ళ ముందే అంత జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఏదీ మాట్లాడకుండా అందరి ముందు ఇలా ఇంటి పరువు తీస్తున్నావు అని అమ్మ కోప్పడుతుంటే
ముందుకు వచ్చిన నాన్న అమ్మ భుజం మీద చేయి వేసి కొద్దిగా నొక్కిపెట్టి నువ్వు ఆగు.. అని నా వైపు చూశారు నాకు ఏదో చెప్పాలని.