New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 4

మనసా మాట వినవే – 4

                               పార్ట్…4

 

” నీకు ఏం అనిపిస్తే అది చెయ్యి రా ” అన్నారు వాళ్ళు.

 

దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకుని ” అలాగే నేను బావ నీ పెళ్లి చేసుకుంటా” అంది.

 

అందరూ సంతోషంగా శ్యామ్ నీ తీసుకుని వెళ్లి రెడీ చేసి ముసుగు వేశారు.

 

 

ఆనంద్, శ్రీనివాస్ ఇద్దరు సిద్దు దగ్గరకి వెళ్లారు.

 

ముహూర్తానికి సమయం అవ్వడంతో శ్యామ్ నీ తీసుకుని వచ్చి సిద్దు పక్కన కూర్చోబెట్టారు. 

 

దేవుడా ఏం జరగకుండా, ఎటు వంటి ఆటంకం రాకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి అని మనసులోనే దేవుడికి వంద కంటే ఎక్కువ సార్లు అనుకుంది సునంద.

 

శ్యామ్ భయంతో వణకడం చూసిన సిద్దు తన చేతితో శ్యామ్ చేతిని పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే ఏం కాదు అన్న ధైర్యం వచ్చింది శ్యామ్ కి.

 

పూజ అంత పూర్తి అయ్యాక పంతులు గారు బజంత్రీలు అంటూ బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అన్నాడు.

 

సిద్దు తాళి బొట్టు చేతిలోకి తీసుకున్నాడు. 

 

అందరూ ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి త్వరగా కట్టేయి అని మనసులో దేవుడిని ప్రార్థిస్తూ సిద్దు వంక చూస్తున్నారు.

 

వాళ్ళని ఒకసారి చూసిన సిద్దు ఏమైంది అన్నట్టు కను బొమ్మలు ఎగురవేశాడు.

 

అందరూ ఏం లేదు అన్నట్టు పైకి నవ్వుతూ లోపల కాళ్ళు చేతులు వణుకుతుంటే అలాగే నిల్చున్నారు.

 

నాయనా సమయం మించి పోతుంది త్వరగా తాళి కట్టు అనగానే అలాగే అంటూ శ్యామ్ మెడలో మూడు ముడులు వేశాడు. 

 

వేద మంత్రాల సాక్షిగా ఏడు అడుగులు వేశాడు శ్యామ్ చెయ్యి పట్టుకుని.

 

పంతులు గారు బాబు అమ్మాయి నుదిటిన కుంకుమ పెట్టండి అని చెప్పాడు.

 

అలాగే అంటూ కుంకుమ చేతిలోకి తీసుకుని ముసుగు పైకి తీసి చేతిని శ్యామ్ నుదిటి దాకా తీసుకుని వెళ్లి ఆగిపోయాడు.

 

అతని నోటి వెంట అప్రయత్నంగానే శ్యామ్ అని వచ్చింది.

 

వెంటనే కోపంగా సునంద, శ్రీనివాస్ వంక చూసాడు. వాళ్ళు బాధగా కొంచెం ఓపిక పట్టు రా అందరూ వెళ్ళే వరకూ అని చెప్పినట్టు చేతులు జోడించారు.

 

కుంకుమ పెట్టకుండా అలాగే తన చేతిని వెనక్కి తీసుకుని కూర్చున్నాడు సిద్దు. శ్యామ్ కళ్ళ నీళ్లతో అలాగే సిద్దు వైపు చూస్తూ ఉంది.

 

కార్యక్రమం అయిపోగానే అందరూ బోజనాలు చేయడానికి వెళ్ళిపోయారు.

 

అందరూ వెళ్ళగానే సిద్దు కోపంగా లేచి తన మెడలోని పూల మాలనీ తీసి నేలకేసి కోట్టీ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

 

శారద సిద్దు కోపం చూసి ” నాకెందుకో భయంగా ఉంది సునంద. సిద్దు ఎలా రీయాక్ట్ అవుతాడో ఇప్పుడు ” అంది.

 

” మేము సర్ది చెప్తాం లే. మీరు ఏం కంగారు  పడకండి ” అని శ్రీనివాస్ కూడా చెప్పడంతో సరే అన్నారు వాళ్ళు.

 

శ్యామ్ లేచి సిద్దు గది వైపు అడుగులు వేసింది.

 

” ఎక్కడి కి వెళ్తున్నావు శ్యామ్ ” అని అడిగింది సునంద.

 

” బావ తో మాట్లాడుత అత్త. నా వంక అసహ్యంగా చూస్తున్నాడు. నేను జరిగింది మొత్తం చెప్తే అర్థం చేసుకుంటాడు ” అంటూ పైకి వెళ్ళింది.

 

గది ముందు నిలబడి కంగారు పడుతూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది.

 

సిద్దు అటు వైపు తిరిగి ఉన్నాడు. శ్యామ్ లోపలికి వెళ్ళి డోర్ దగ్గరగా వేసి సిద్దు వెనక నిల్చుంది.

 

” అందరి కంటే ఎక్కువ గా నిన్నే నమ్మాను కదే. నన్ను ఎలా మోసం చేయాలి అనిపించింది నీకు ” అన్నాడు సిద్దు వెనక్కి తిరగకుండానే.

 

” బావ అది ” అని ఎదో చెప్పబోతుంటే ” నన్ను అలా పిలవకు. అలా పిలిచే అర్హత కొల్పోయావు ” అన్నాడు కరుకుగా.

 

శ్యామ్ ఏడుస్తూ ” నేను కావాలని చేయలేదు బావ. అత్త, మావయ్య నే నేను వద్దు అని చెప్తున్న కూడా పరువు పోతుంది అని ఇలా చేయమన్నారు ” అంది.

 

” శ్వేత నీ ఏం చేశారే ” అన్నాడు కోపంగా.

 

” తను నిన్ను ప్రేమించలేదు అంట బావ. డబ్బు, నగలు తీసుకుని వెళ్ళిపోయింది. పెళ్లి ఆగిపోతే అందరూ ఒక్కో మాట అంటారు అని అత్తమ్మా ” అంది బాధగా.

 

ఆ మాటకి సిద్దు కోపంగా వచ్చి శ్యామ్ నీ గట్టిగా కొట్టాడు. అయినా ఏడుస్తూ అలాగే నిలబడింది చెంప పై చెయ్యి పెట్టుకుని.

 

” నా శ్వేత నన్ను ఎప్పటికీ మోసం చేయదు. మీరే ఎదో చేసి ఉంటారు దాన్ని. ముందు నుంచి అది అంటే మీకు ఇష్టం లేదు కదా. అయినా నిజంగా అది వెళ్లిపోతే నాకు వచ్చి చెప్పాలి కానీ ఇలా పెళ్లి చేసుకుంటావా “

 

” నేను చెప్పాను బావకి ఇష్టం ఉండదు అని. కానీ ” అంటూ ఆగిపోయింది.

 

” కానీ వాళ్ళు చెప్పారు అని చేసుకున్నావు అంతే నా. చాలా పెద్ద తప్పు చేసావు.  ఇంక నుంచి నాతో నువ్వు అసలు మాట్లాడకు. మాట్లాడాలి అని చూసినా నా విషయాల్లో కలుగ చేసుకున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు ” 

 

” బావ అంత మాట అనకు. నీతో మాట్లాడకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా ” అంది చెయ్యి పట్టుకుని.

 

తన చెయ్యి విసిరి కొడుతూ ” నన్ను అలా పిలవకు ” అంటూ బయటకి వెళ్లి తలుపు గట్టిగా వేస్తూ వెళ్ళిపోయాడు.

 

ఆ సౌండ్ కి ఉలిక్కి పడి అలాగే ఏడుస్తూ కూర్చుంది. సిద్దు వెళ్ళిపోయాక అందరూ లోపలికి వచ్చారు. 

 

జరిగింది మొత్తం శ్యామ్ చెప్పడంతో ” అర్థం చేసుకుంటాడు అనుకుంటే ఇలా చేస్తున్నాడు ఎంటి వీడు ” అంది సునంద తల పట్టుకుంటూ.

 

శారద శ్యామ్ దగ్గరకి వచ్చి తన చెంప నిమురుతూ ” లే పదా వెళ్దాం ” అంది.

 

” ఎక్కడికి అమ్మా “

 

” మన ఇంటికి. ఇక్కడ ఉండి నువ్వు బాధ పడుతూ ఉంటే అక్కడ మేము ఎలా ప్రశాంతంగా ఉంటాం “

 

” శారద మా పైన నమ్మకం లేదా నీకు. మేము దాన్ని బాగా చుసుకోమా ” అన్నాడు శ్రీనివాస్.

 

” మీరు చూసుకుని ఏం లాభం అన్నయ్యా. వాడు కదా చూసుకోవాలి “

 

” శారద తను కోరుకున్న అమ్మాయి కాకుండా మన శ్యామ్ అక్కడ ఉండే సరికి వాడికి కోపం వచ్చింది. రెండు రోజులు పోతే వాడే సర్ధుకుంటాడు. నీకు తెలీదా వాడికి ఇది అంటే ఎంత ఇష్టమో “

 

” అవును శారద కొంచెం టైం ఇద్ధం వాడికి ” అన్నాడు ఆనంద్ కూడా.

 

” అవును అమ్మా బావ ఎదో కోపంలో అలా చేసాడు. మీరు వెళ్ళండి నేను రాను ” అంది శ్యామ్.

 

” మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ నాకు నువ్వు బాధ పడుతున్నావు అని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచను ” అంటూ వెళ్ళిపోయింది.

 

ఆనంద్, శ్రీనివాస్ భుజం పై చెయ్యి వేస్తూ ” బాధ పడకు బావ. నీ చెల్లి గురించి నీకు తెలీదా. ఏం కాదు లే ” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

 

సునంద శ్యామ్ దగ్గరకి వెళ్లి ” నన్ను క్షమించు శ్యామ్. వాడికి ఇంత కోపం వస్తుంది అనుకోలేదు ” అంది.

 

” నాకు తెలుసు అత్త. అన్నిటికీ సిద్ధ పడే ఈ పెళ్లి చేసుకున్నా. మీరు ఏం బాధ పడకండి “

 

” బంగారమే నువ్వు ” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 

అలా సాయంత్రం అయ్యింది. సిద్దు గది మొత్తం పూలతో అలంకరించి బెడ్ మధ్యలో హార్ట్ సింబల్ లా రోజా పువ్వులతో డెకరేట్ చేశారు.

 

అదంతా చూసిన శ్యామ్ ” ఎంటి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు ” అంది సునంద, సారిక ను.

 

సారిక నవ్వుతూ  ” ఈ రోజు మి ఫస్ట్ నైట్ కదా వదిన ” అంది.

 

” ఎంటే కొత్తగా వదిన అంటున్నావు “

 

” మరి ఇప్పుడు వదినవే గా నువ్వు నాకు “

 

” పెళ్లికి ముందు ఎన్ని సార్లు అడిగా అలా పిలవమని ఎప్పుడు అయినా పిలిచావా ” 

 

” అప్పుడు ఎడిపించాలి అని పిలవలేదు “

 

శ్యామ్ ఉడుక్కుంటు ” అత్తమ్మా ఇప్పుడు ఇవన్నీ చూస్తే బావ కి ఇంకా కోపం వస్తుంది ” అంది.

 

” కోపం వచ్చినా చేయాల్సిన పని చేయాలి గా ” అని మొత్తం సర్ది వెళ్ళిపోయింది.

 

” రా వదిన నీతో పని ఉంది ” అంటూ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లింది సారిక.

 

కాసేపటికి సిద్దు వచ్చి గదిని అంత చూసి కోపంగా కిందకి వెళ్ళాడు.

 

కోపంగా కిందకి వచ్చిన సిద్దు అమ్మా… అంటూ గట్టిగా అరిచాడు హాల్ మధ్యలో నిలబడి.

 

తన గదిలో నుండి జడ అల్లుకుంటూ బయటకి వచ్చింది సునంద. తనతో పాటు సారిక కూడా వచ్చింది.

 

” అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచా ” అన్నాడు సిద్దు కోపంగా.

 

” ఏం జరుగుతుంది ” అంది సునంద తన పని తను చూసుకుంటూ.

 

” నా రూం నీ అలా ఎవరు డెకరేట్ చేశారు “

 

” మేమే ” 

 

” ఎందుకు “

 

” ఈ రోజు మీ ఫస్ట్ నైట్ కదా అందుకే “

 

” అసలు నేను ఈ పెళ్లి జరగలేదు అనుకుంటున్నా. మళ్ళీ ఇది ఒకటా. ముందు నా శ్వేత నీ ఏం చేశారు అది చెప్పండి. మీకు అది అంటే ముందు నుంచి ఇష్టం లేదు కదా ” అన్నాడు కోపంగా

 

” నీ ఇష్టాన్ని గౌవరించి మేము పెళ్లికి ఒప్పుకున్నాo. అది వెళ్లిపోతే మేము ఏం చేయాలి ” అంది సునంద అంతే కోపంగా.

 

” తను అలా చేయదు. మీరే ఎదో నాటకాలు ఆడుతున్నరు”

 

” తెలిసిన రోజు నువ్వు ఈ మాట అనవు ” అని మళ్ళీ సిద్దు దగ్గరకి వచ్చి గడ్డం పట్టుకుని ” రేయ్ సిద్దు ఆ పిచ్చి దానికి నువ్వు అంటే చచ్చేంత ఇష్టం రా. ఎప్పటి నుండో అది నిన్ను ప్రేమిస్తుంది. దాన్ని బాధ పెట్టకు. మేము బయటకి వెళ్తున్నాము. మీ నాన్న వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ తో. నేను చెల్లి కూడా వెళ్తున్నాం ” అంటూ సారిక నీ తీసుకుని వెళ్ళిపోయింది.

 

సిద్దు వెళ్లి ఆ బెడ్ నీ చూస్తూ అలాగే కూర్చున్నాడు. కాసేపటికి శ్యామ్ పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వచ్చింది. సిద్దు పడుకుని ఉండడం చూసి ఆ గ్లాస్ పక్కన పెట్టీ 

 

” బావ ” అంది. 

 

సిద్దు పైకి లేచి శ్యామ్ దగ్గరకి వస్తూ ” నువ్వు నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నావే ” అని అడిగాడు.

 

సిద్దు సడెన్గా అలా అడిగే సరికి బావ కి ఎలా తెలిసింది ఈ విషయం అని కంగారుగా ” నీకు ఎవరు చెప్పారు బావ ” అంది.

 

” అంటే నిజంగానే నన్ను ప్రేమించావు ”  అన్నాడు సీరియస్గా.

 

@@@@@@@@@@@@@@@@@@@@@

 

To be continued………..