ఎపిసోడ్ 72
“నీకో విషయం తెలుసా? నేను జీవితంలో నిన్ను వదిలి పెట్టను. దట్స్ ఫైనల్ ” ఖచ్చితంగా చెప్పాడు విజె.
“బాగుంది. మీ అమ్మగారు మనకు డివోర్స్ ఇప్పించడానికి చిన్నత్తతో కలిసి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది.
ఇక్కడ మీరు నన్ను వొదలనని అంటున్నారు. కాని మన కాంట్రాక్ట్ మరిచిపోయారా?” అని అడిగింది స్వప్నిక.
ఒక్కసారి ఆమె వైపు సీరియస్ గా చూసి..
“అదెందుకు గుర్తుండదు? లేకపోతె నువ్వు ఎలాగో మాటిమాటికి గుర్తు చేస్తూనే ఉంటావ్ కదా?
అయినా అమ్మ చేసిన ఛాలెంజ్ ఓడిపో. అప్పుడు మన కాంట్రాక్ట్ బాధ ఉండదు.” అని అన్నాడు విజె.