ప్రణయాగ్న:❤️
పెళ్ళ్లి
ఉదయం నుంచే వైష్ణవి మనసులో అలజడి మొదలైంది. ఆధిరాజ్ పంపిన బెదిరింపులు ఆమెను వెంటాడుతున్నాయి. తన గురించి మీడియా ఏమనుకుంటుందో ఆమెకు భయం లేదు. కానీ తనను పెంచిన అనాథాశ్రమంలోని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోరుకుంది.
అప్పుడే రేణు ఫోన్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చింది.
“వైష్ణవి, అనాథాశ్రమం నిర్వాహకురాలు ఫోన్ చేశారు. అక్కడికి కొంతమంది మీడియా వాళ్లు వచ్చారట. ఆధిరాజ్ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారట.”
ఆ మాట వినగానే వైష్ణవి కళ్లలో నీళ్లు తిరిగాయి.