New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమదేశం యువరాణి 💘 – 5

ప్రేమదేశం యువరాణి 💘 – 5

ప్రేమదేశం యువరాణి 💘 5.

 

ముందే ఆవిడకి నువ్వంటే చాలా చాలా కోపం ఇప్పుడు నువ్వు సడన్  క్లాసులో కనిపిస్తే…. ఏమంటారో ఏమో అని భయంగా అంది శ్రావణి.

 

 

ఏయ్ శ్రావి నువ్వు అనవసరంగా భయపడకు ఆవిడ నన్నేం చేయలేరు. అయినా ఆవిడ తిట్లు ఏమన్నా నా కొత్త నాకు అలవాటే ముందు డెమో ని కంప్లీట్ చేసి తర్వాత ఆవిడ గురించి ఆలోచిద్దాం పదండి ముందు లంచ్ చేద్దాం టైం కూడా అయిపోతుంది.

 

 

మళ్లీ వెంటనే డెమో స్టార్ట్ చేయాలి ఇంకా ప్రాజెక్టుకి సడ్మిట్ చేయాలి పదండి పదండి తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి క్యాంటీన్ కి వెళ్లి లంచ్ చేసి మళ్ళీ క్లాసులోకి వచ్చింది మీను.

 

 

తను క్లాసులోకి వచ్చి చూడంగానే లెక్చరర్ అక్కడ కనిపించింది. మీను లెక్చరర్ దగ్గరికి వెళ్లి ఐ యాం సో సారీ మామ్ నాకు తెలుసు ఈ రోజు డెమో ఉంది కానీ నేను చాలా లేట్ గా వచ్చాను మరి ఏం చేయమంటారు?

 

 

ఈరోజు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ మామ్ పైగా ఆయనెవరు వర్మ వారసుడు వస్తున్నాడని సిటీ అంత బ్లాక్ చేసేసారు. నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. అందుకే రాలేకపోయాను మామ్ అని అసలు విషయం చెప్పింది.

 

 

ఆ లెక్చరర్ వర్మ  పేరు వినగానే గుండెల్లో భయం మొదలైంది వర్మ వారసుడు వస్తున్నాడని ఈరోజు ఆవిడకి కూడా తెలుసు. 

 

 

అంతేకాదు ఆమె భర్త కూడా బిజినెస్ చేస్తాడు. ఆయన కూడా వర్మ కంపెనీతో ఎప్పటినుంచో ఒక్క డీలయినా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వాళ్ళు అతని అటువంటి ఛాన్స్ ఇవ్వడం లేదు.

 

 

ఇంకా అతని పేరు వినగానే ఆ లెక్చరర్ ఇంకేం మాట్లాడలేదు పైగా వాళ్లకి ముందు రోజు ప్రిన్సిపాల్ చెప్పాడు డెమోకి స్టూడెంట్స్ కొంచెం లేట్ అయినా తర్వాత సెషన్ లో వాళ్ళని డెమో ఇచ్చి ప్రాజెక్ట్స్ సడ్మిట్ చేసేలా చూడండి.

 

 

మన స్టూడెంట్స్ అందరికీ మంచి కంపెనీస్లో జాబ్ ఆఫర్ రావాలని ప్రిన్సి స్ట్రిక్ట్ వార్మింగ్ ఇచ్చారు.

 

 

ఆ లెక్చరర్ కి వేరే దారి లేక సరే వెళ్లి మీ డెమోని స్టార్ట్ చేయండి అని చెప్పింది. మీను చిన్నగా నవ్వి శ్రావణి ఇంక రోజికి సైగా చేసింది.

 

 

వాళ్ళిద్దరు నేరుగా అక్కడున్న ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళారు. 

 

 

ముగ్గురు కలిసి తయారు చేసిన డెమోని ప్రాజెక్ట్ ని

 అందరికీ అర్థం అయ్యేలా వివరించి చెప్పారు. ఆ ముగ్గురు చెప్పింది విని అక్కడికి వచ్చిన చాలా కంపెనీస్ కి సంబంధించిన హెడ్స్ అందరూ ఆ ముగ్గురు అమ్మాయిల టాయిలెట్ ని చాలా పొగిడారు.

 

 

వాళ్ళందరూ ఇటువంటి అమ్మాయిలు తమ కంపెనీలో ఉంటే తమ కంపెనీకి నిజంగానే ఎంతో హెల్ప్ అవుతుందని వాళ్ళ టాలెంట్ తమ కంపెనీకి ఎంత అవసరమనుకొని వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ ని వాళ్ళ పేర్లేని నోట్ చేసుకున్నారు. 

 

 

మీను తన అనుకున్నట్టే ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్  స్నేహితులతో కలిసి సబ్బిట్హ్యా హ్యాపీగా తన సీట్ లో కూర్చుంది. 

 

 

గత మూడు నెలలుగా తన కష్టపడుతున్న వర్క్ కంప్లీట్ అవ్వడం తన అనుకున్నట్టు….. తను ప్రజెంటేషన్ తో  వచ్చిన వాళ్ళుని మెప్పించడం ఇవన్నీ తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయి.

 

 

ఖచ్చితంగా తన అనుకున్నట్టు మంచి కంపెనీలో తనకు జాబ్ ఆఫర్ వస్తుందని దీంతో తన తల్లికి కొంచమైనా తను ఫైనాన్షియల్ గా హెల్ప్ 

అవుతుందిని  ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయింది.

 

 

విహారి కార్ నేరుగా మెన్షన్ ముందు ఆగింది. అసిస్టెంట్ డోర్ తెరవడంతో విహారి కారులోంచి బయటికి వచ్చి ఆ మెన్షన్ చూశాడు.

 

 

ఐదు సంవత్సరాల ముందు జరిగిన సంఘటన అతనికి ఇప్పటికీ కూడా మదిలో మెదులుతూనే ఉంది.

 

 

అతను గట్టిగా పిడికెళ్ళు బిగించి ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి వెళ్ళాడు. విహారి వచ్చాడని మెన్షన్ లో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరి గదుల్లో నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. 

 

 

విహారి నేరుగా హాల్లోకి వచ్చి అక్కడున్న కింగ్ సైజ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని తాతయ్య ఎక్కడ గంభీరంగా అడిగాడు.

 

 

అందరూ విహారి గొంతుకు ఒక్క క్షణం దడుచుకున్నారు.

 

 

విహారి అంటే వర్మాస్ ఎంపైర్ కె ఒక ఎదురులేని యువరాజు.

 

 

తను చెప్పిందే వర్మాస్ లో జరుగుతుంది. అతనికి నచ్చనిది అక్కడ జరగడానికి వీల్లేదు ఫ్యామిలీ మొత్తం విహారి కనుసన్న లోనే నడుస్తుంది. 

 

 

ఐదు సంవత్సరాల ముందు తామ చూసిన విహారి ఇప్పుడు తమ ముందున్న విహారి ఒకటి కాదని వాళ్ళందరికీ అర్థం అవడానికి పెద్ద సమయం పట్టలేదు.

 

 

అప్పుడే తగదీష్ గారి గదిలోంచి బయటికి వచ్చిన విహారి మేనత్త నళిని నేరుగా అతని ఎదురుగా నిలబడి ఎలా ఉన్నావు కన్నా?

 

 

ఎంత కాలమైంది రా నిన్ను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకొని విహారి నుదుటన ముద్దు పెట్టింది.

 

 

విహారి ఆమెని చూసి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తన మేనల్లుడు కోపం నళిని గారికి బాగా తెలుసు.

 

 

కథా వర్ణిక లో ఇది నా ఫస్ట్ స్టోరీ ✍️ ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్ చదివి కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి.