సుకుమారి వాళ్ళ అమ్మమ్మ కి అయితే సుకుమారిని అంత దూరం , అది అలాంటి చోటికి పంపటం ఇష్టం లేదు. కానీ సంతోషి కి సుకుమారి పై ఉన్న ప్రేమని చూసి , సంతోషి మాటకి కాదు అని అనలేక పోయింది.. కానీ మరీ అన్ని రోజులు ముందు అంటే వద్దు అన్నది.
“పెళ్లికి ముందే 20 రోజులు అంటే , పెళ్లి అయ్యాక కనీసం పది రోజులైనా మళ్ళీ ఏవో ఒకటి ఉంటాయిగా.. అప్పుడు సుకుమారి చదువుకు కూడా ఇబ్బంది అవుతుంది. ముందు నువ్వు వెళ్ళు, సుకుమారుని మాతో పాటు రెండు రోజులు ముందే తీసుకుని వస్తాం. పెళ్లి తర్వాత నీతో కలిసి వస్తుందిలే” అని సుకుమారి అమ్మమ్మ సంతోషి తో అన్నారు.
‘హమ్మయ్య… ఎలాగైతేనేం , ఎప్పుడైతేనే సుకుమారి వస్తుందిగా’ అనుకుని సంతోషి సంతోషంలో మునిగిపోయింది…
అదండీ…. ఈ బంగారం లాంటి అమ్మాయి సుకుమారి కథ… మరి ఇక్కడ అయితే శీతాకాలం మొదలైంది. మరి మన బంగారానికి మొదలు అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది…
ఎప్పుడెప్పుడు ఊరు వెళ్తానా , అందరినీ ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్న సుకుమారికి ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది..
శ్రీకాకుళం వెళ్ళాలి అంటే ముందు తణుకు వెళ్ళాలి. పాలంగి నుంచి తణుకు ఆటో లో వెళ్ళాలి. 20 నిమిషాలు పడుతుంది. మన బంగారంని వాళ్ళ మావయ్య బైక్ పై రైల్వే స్టేషన్ లో దింపాడు..