New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసులు కలిసిన వేళ❤️ – 12

మనసులు కలిసిన వేళ❤️ – 12

బైక్‌ బయట పార్క్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో సూర్యనారాయణ వర్మ ఎవరోతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. రాజరాజేశ్వరి దేవి భోజనానికి ఏర్పాట్లు చూస్తోంది.

వచ్చావా నాన్నా, ఎక్కడికి వెళ్లావు ఇంతసేపు అని అడిగింది రాజరాజేశ్వరి.

ఊరిలో అలా తిరిగానమ్మమ్మా అన్నాడు సూర్యాన్ష్‌.

ఊరిలో తిరిగితే ఇంతసేపు పడుతుందా. భోజనం కూడా చేయలేదు కదా.

అదిగో, ఇప్పుడే తింటాను. ముందు కాస్త నీళ్లు ఇవ్వు.

రాజరాజేశ్వరి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది.

అది తాగుతూ సూర్యాన్ష్‌ సోఫాలో కూర్చున్నాడు.

ఫోన్‌ మాట్లాడటం పూర్తిచేసిన సూర్యనారాయణ అతని దగ్గరకు వచ్చాడు.

ఏరా సూర్యా, ఊరంతా తిరిగావా అని అడిగాడు.

దాదాపుగా తాతయ్యా అన్నాడు సూర్యాన్ష్‌.

మరి ఎవరినైనా కలిశావా.

సూర్యాన్ష్‌ చిన్నగా నవ్వాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue