New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మానసిచ్చిన మహారాణి – 2

మానసిచ్చిన మహారాణి – 2

అను పనులు ఎన్ని చేసుకొని  ఆఫీస్ కి స్టార్ట్ అయింది, తనకు ఆఫీస్ కి వెళ్ళాలి అంటే భయం ఎందుకంటే ఆ ఆఫీస్ మేనేజర్ ఒక సైకో.

 

అను ని ప్రేమిస్తున్న అని వెంట పడేవాడు, అతనికి పెళ్లి అయింది పిల్లలు కూడా ఉన్నారు.

 

కానీ అను ని చూసి, తన అందం చూసి వదిలిపెట్టబుద్ధి కాకా, రోజు ఏదో ఒక పని అని చెప్పి తన కేబిన్ కి పిలుచుకునే వాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాడు, కానీ అను ఎం అనలేకపోయేది.

 

ఒక రోజు ధైర్యం చేసి, సార్ నా వెంట పడకండి, నన్ను వదిలేయండి సార్. మీకు ఇంతక ముందే పవలి అయింది అని నాకు తెలుసు, దయచేసి నన్ను వదిలేయండి సార్ అని బతిమిలాడింది అను.

 

ఓకే నా గురించి తెలిసింది, ఓకే, కానీ నాతో ఒక నైట్ పడుకో చాలు, మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను అని వంకరగా మాట్లాడాడు ఆ మేనేజర్.

 

అంతే అను కి కోపం వచ్చి గట్టిగ అతని చంప మీద కొట్టింది.

 

అను ఆలా కొట్టగానే అతనికి కోపం వచ్చి కొట్టబోయడు అను ని కానీ కొట్టకుండా, ఈ రోజు నుంచి నీకు టార్చెర్ చూపిస్తాను అగు…

 

నెల నెల నీ శాలరీ రావాలి అంటే ఆఫీస్ లో వర్క్ చేయాలి, కానీ నీకు రోజు డబల్ వర్క్ ఇస్తాను ఎంత టైం అయినా నువ్వు వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళాలి. లేదంటే నీ నెల శాలరీ రాదు అని బ్లాక్మెయిల్ చేసాడు అతడు.

 

ఆ మాటకు అను కి ఏడుపు వచ్చింది, ఎం చేయలేక అలానే నిలబడి చూస్తుంది.

 

ఏంటి నాతో నైట్ పడుకుంటావా, లేక డబల్ వర్క్ చేస్తా

ఛాయిస్ ఇస్ యూర్స్ అని చైర్ లో కూర్చుంటాడు అతడు.

 

అను భయపడుతూ సార్ నేను ఎం తప్పు చేయలేదు గా సార్ నన్ను ఎందుకు ఇలా టార్చెర్ చేస్తున్నారు అని ఏడుస్తూ అడిగింది అను.

 

ఎక్సట్రా ప్రశ్నలు వేయకుండా సమాధానం చెప్పు అని కోపంగా అడిగాడు.

 

అను బయపడి డబల్ వర్క్ చేస్తాను సార్ అని అన్నది అమాయకంగా ఏడుస్తూ.

 

ఓకే మరి వేళ్ళు అని చెప్పాడు అతడు.

అను సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయి తన చైర్ లో కూర్చుంది.

 

అను బెస్ట్ ఫ్రెండ్ అయినా రాణి అను దగ్గరకు వచ్చి ఏమైంది అను అని అడిగింది.

 

అను ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది.

 

రాణి ఎం చేయలేక, నువ్వు ఇక్కడ ఉండొద్దె జాబ్ వదిలేసి వెళ్ళిపో అను అని అన్నది రాణి.

 

వదిలేయాలని నాకు ఉంది కానీ మా పిన్ని నేను జాబ్ వదిలేసాను అని తెలిస్తే బతకానివ్వదు అని ఏడుస్తూ అన్నది అను.

 

ఓకే ఏడవకు, వేరే జాబ్ కోసం ట్రై చెయ్, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పింది రాణి.

 

ఓకే అనుకోని మళ్ళీ వర్క్ లో పడిపోయారు, లేకుంటే వల్ల మేనేజర్ తిడుతాడు అని.

 

ఆలా నైట్ అయిపోయింది 11 అయినా కూడా అను వర్క్ కంప్లీట్ కాలేదు.

 

ఆఫీస్ లో వాళ్ళు అందరూ వెళ్లిపోయారు.

 

తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆటో లో ఇంటికి వెళ్ళేది రోజు.

 

ఇంటికి వెళ్ళాక ఇంట్లో పని, ఆలా ఆలా సాగిపోతుంది అను జీవితం.

 

ఒక రోజు ఉదయం ఆఫీస్ కి టైం అవుతుంటే తొందరగా బస్సు స్టాప్ కి వచ్చి నిలబడింది. కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది.

 

ఎం చేయాలో తేలిక ఆటో కోసం చూస్తుంది.

 

ఆఫీస్ కి లేట్ గా వెళ్తే శాలరీ కట్ చేస్తారు.  శాలరీ తక్కువ వస్తే అను పిన్ని వాతలు తెలీలా కొడుతుంది.

 

అందుకే తొందరాగ వెళ్ళాలి అనే తొందరలో ఆటో కోసం ముందుకు వెళ్తూ, కార్ కి తగిలి కింద పడింది అను.

 

అసలే టెన్షన్ లో ఉన్న అను, ఇప్పుడు కార్ తనకు తగిలిసరికి కోపం తో కార్ వైపు చూసింది అను.

 

అందులో ఉన్న వ్వక్తి వచ్చి తన పాకెట్ లో నుంచి మనీ తీసి అను చేతిలో పెట్టాడు. సారీ అని కూడా చెప్పకుండా.

 

ఆలా చేతిలో మనీ పెట్టగానే అను కి కోపం వచ్చి ఆ వ్వక్తి ని చెంప మీద గట్టిగ కొట్టింది.

 

 

ఆ వ్వక్తి ఎవరో కాదు మన విక్రమ్ రాణా.

 

తనని 1st time  ఒకరు కొట్టడం, అది కూడా ఒక అమ్మాయి అయ్యే సరికి విక్రమ్ కోపం నాశనికి అంటింది కోపం తో పిడికిలి గట్టిగ బిగుసుకుంది, మెడ నరాలు మొత్తం బయటకు కనిపిస్తున్నాయి, కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండి పోతున్నాయి,

 

ఆ కోపం లో అతడిని చూస్తే హార్ట్ ఎటాక్ వస్తుంది అన్నంత భయంకంగా కనిపిస్తున్నాడు కోపం లో.

 

అను అతని పేస్ ని చూడకుండా తన మనీ ని మళ్ళీ అతని చేతిలో పెట్టి, ఆటో ఎక్కి వెళ్ళిపోయింది అను విక్రమ్ ని చూడకుండా.

 

చూసి ఉంటే అను కె హార్ట్ ఎటాక్ వచ్చేది, చూడలేదు కాబట్టి సరిపోయింది.

 

విక్రమ్ అయితే అలానే నిలబడి అను వెళ్లెవరకూ చూస్తున్నాడు.

 

జీవన్ డ్రైవింగ్ చేస్తున్నాడు, సడన్ గా అను నే అడ్డు వచ్చింది.

 

విక్రమ్ అను ని చూసి తిట్టలేక, కార్ దిగి మనీ చేతిలో పెట్టాడు.

 

అను కి మనీ ఆలా పెట్టేసరికి కోపం తో కొట్టేసింది అక్కడ ఎవరు ఉన్నారు అని చూసుకోకుండా.

 

ఆలా విక్రమ్ కోపం తో  అక్కడే నిలబడి ఉంటే, జీవన్ వచ్చి తెలిదేమో నువ్వు ఎవరో వదిలేసాయ్ విక్రమ్ అని నచ్చచెబుతాడు జీవన్.

 

నో, అస్సలు వదిలిపెట్టను….అని విక్రమ్ అంటాడు.

 

దాని డీటెయిల్స్ నాకు ఒక గంట లో కావాలి అని ఆర్డర్ పాస్ చేసాడు విక్రమ్.

 

ఓకే విక్రమ్ అని జీవన్ చెప్పి కార్ లో కూర్చొని వెళ్లిపోయారు ఇద్దరు.

 

కానీ విక్రమ్ మాత్రం కోపం తో ఉగిపోతున్నాడు.

 

విక్రమ్ ని చూసి జీవన్  తన మనసులో ఆ అమ్మాయి పని అయిపోయింది ఈ రోజుతో అని అనుకున్నాడు.

 

 

కొనసాగుతుంది……

 

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

స్టోరీ నచ్చితే ఫాలో చేయొచ్చు కదా…..

 

స్టోరీ ఎలా ఉందొ చెప్పండి ప్లీస్…..

 

రేటింగ్స్ కూడా ఇవ్వండి……