గదిలోకి విసురుగా అడుగుపెట్టి, పక్కనే ఉన్న ఫైల్స్ ని బెడ్ మీద పడేశాడు.
ఏయ్! లే.. ఇంకా ఎంతసేపు ఆ గాయాన్ని చూపిస్తూ డ్రామాలు ఆడతావు?
ఇక్కడ కూర్చుని ఫ్రీగా మేత మేయడానికి ఇది అనాథాశ్రమం కాదు. నువ్వు నా ఖైదీవి.. బానిసవి!
రేపటి నుండి ఈ ఆఫీస్ ఫైల్స్ అన్నీ నువ్వే చెక్ చేయాలి. ఒక్క అక్షరం తప్పున్నా నిన్ను మళ్ళీ ఆ చీకటి గదిలో పడేస్తాను.
ఈ వర్క్ అంతా ఎప్పుడు పూర్తి చేస్తావో నాకు తెలియదు కానీ రేపు సాయంత్రం కల్లా నాకు పూర్తవ్వాలి అర్థమైందా అని గర్జించాడు.
మైరా భయంవల్ల వణికిపోతూ, కానీ ఇషాంత్ గారు.. నా చేయి నొప్పిగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది.