ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను.. అని చెబుతూనే కనకాంబరం ఎడ్జెస్ స్మూత్ గా చప్పరించి చేతిలో పెట్టుకుంటూ వీటితో హనీ కలెక్ట్ చేద్దామా..?? అంది గ్రేట్ ఇన్నోవేషన్ ఎక్స్ప్రెషన్ తో.
తన ఐడియా కి నవ్వలేక ఏడవలేక.. చేద్దాం చేద్దాం ఫస్ట్ నువ్వు వచ్చిన పని పూర్తి చెయ్యి. ఆ తర్వాత అర్జున్ పర్మిషన్ తీసుకొని వీటితో హనీ ప్రొడ్యూస్ చేద్దాం అని లోపలికి తీసుకువచ్చాడు.
అక్క అవి ఇటు ఇవ్వు అని బుజ్జి పాప అడ్డం వచ్చి అడిగితే తన గుప్పిట నిండా ఉన్న కనకంబరాలు.. మొత్తం 78, జాగ్రత్తగా చూసుకో.. అని ఇచ్చిన మేఘ ముఖంలోని అమాయకత్వానికి ఆ పిల్ల విచిత్ర ముఖంతో సరే అని పూలు మొత్తం డబ్బాలో పడేసుకుని రివ్వున పరిగెత్తింది.