New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 49

రాక్షసప్రేమ – 49

49

 

 

భరద్వాజ్ గట్టిగా నవ్వుతూ తన భార్యను దగ్గరకు తీసుకున్నారు. కానీ మనసులో మాత్రం ఏదో చిన్న భయం ఇద్దరి కూతురులని ఒకే ఇంటికి కోడలుగా వెళ్లారు. అక్కడ ఇద్దరు హ్యాపీగానే ఉంటారా..? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనని ఉక్కిరి బిక్కిరి చేసేసింది..

 

పూజిత నేమో అక్కడ తన కూతురు హ్యాపీగా ఉంది అని ఇక్కడ తను కూడా మనసులో సంతోషంగా ఫీల్ అయింది. 

 

తన పేరెంట్స్ తనతో మాట్లాడారు అని హ్యాపీగా చిందులు వేస్తున్న శౌర్యకి తన వెనకే చేతులు కట్టుకొని తనవైపే చూస్తున్న రౌద్రా కనిపించడంతో అతడి దగ్గరకు రెండు అడుగుల్లో చేరి అతని చేతులు రెండు పట్టుకొని ఊపేస్తూ “నాన్న నాతో మాట్లాడారు, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, మన మ్యారేజ్ ని కూడా యాక్సెప్ట్ చేసేశారు. ఆరోజు నాన్న అలా మాట్లాడేసరికి చాలా బాధపడిపోయాను ఇప్పుడు ఈరోజు నాకు హ్యాపీగా ఉంది” అని అతని గట్టిగా పట్టుకుంది శౌర్య. 

 

ఆమె కళ్ళలో ఆనందం కనిపిస్తుంటే ఇప్పుడు రౌద్ర కి కూడా చాలా హ్యాపీగా అనిపించి “నువ్వు హ్యాపీ కదా..!” అని అడిగాడు..

 

చాలా హ్యాపీగా ఉన్నాను అని అతడికి దూరం జరిగి ‘ఇదంతా నీ వల్లే, నువ్వు అమ్మా నాన్న తో మాట్లాడావంట కదా, నీ గురించి కూడా చెప్పారు నువ్వు మాట్లాడకపోతే నాన్న ఒప్పుకునే వాళ్ళు కాదేమో, థాంక్యూ నువ్వు నా లైఫ్ లోనికి వచ్చినందుకు, కాకపోతే అప్పుడప్పుడు నువ్వు చేసే పనులకి కోపం వస్తుంది. ఇదిగో ఇలాంటి బాధలు కూడా వస్తాయి ఆ కోపాన్ని బాధల్ని నువ్వే మాయం చేస్తావు” అని అతడు బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి మరీ చెప్పింది శౌర్య. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue