ప్యాలెస్లో హోమ గుండం నుండి వస్తున్న పొగతో హాల్ అంతా నిండిపోయింది.
మంత్రోచ్ఛారణల మధ్య ఇషాంత్, మైరా పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
పూజారి అక్షింతలు వేసి ఆశీర్వదించగానే, దేవిక గారు నవ్వుతూ దగ్గరకు వచ్చారు.
ఇషాంత్, హోమం చాలా బాగా జరిగింది. కానీ సాయంత్రం మన చుట్టాలమ్మాయి సీమంతం వేడుక ఉంది, చాలా మంది గెస్టులు వస్తున్నారు.
ఆ అమ్మాయికి గిఫ్టుగా మంచి చీర అలాగే ఒక మంచి గోల్డ్ నక్లెస్ ఇవ్వడానికి తీసుకుని రండి…ఇప్పుడు మీరిద్దరూ కలిసి సిటీలోని పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లి షాపింగ్ చేసుకుని రండి.
డ్రైవర్ను వద్దు, నువ్వే మైరాను తీసుకెళ్లు అని ప్రేమగా చెప్పారు.