ఆరోజు మధ్యాహ్నం అనిరుద్.. నందు కి కాల్ చేసేసరికి అప్పటిదాకా ఫుల్ గా మేసి అల్లరి చేసి… హాల్లోనే బజ్జుంటుంది… మంగ తనకోసం ఈసారి ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చే లోపు నందు పడుకునేసరికి తనని లేపకుండా ఏసి టెంపరేచర్ తగ్గించి…అక్కడి నుండి వెళ్ళిపోతుంది…
అనిరుద్ మూడుసార్లు కాల్ చేసినా సరే నందు తియ్యకపోయేసరికి అనిరుద్ కి కాస్త కంగారు వస్తుంది ఇంతలో తన ఫ్రెండ్స్ “లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ క్లాస్ కి అటెండ్ అవుదామా!?”అని అడిగేసరికి నందు గురించి మర్చిపోయి క్లాస్ చాలా ఇంపార్టెంట్ అని…లంచ్ కూడా చెయ్యకుండా క్లాస్ డీటెయిల్స్ కనుక్కోడానికి వెళ్తాడు….
ఆఫ్టర్నూన్ క్లాస్ తో పాటు వైవా కూడా…కంప్లీట్ అయితే… ఈవినింగ్ ఫోర్ కి తిరిగి తన కారులో రిటర్న్ అవుతాడు అనిరుద్…అయిన సరే నందు కి ఏ మాత్రం నిద్రలేకవకపోయేసరికి… ఇంట్లోకి కార్ కీస్ ని తిప్పుతూ లోపలికి వెళ్తున్న అతడికి మంగా కంగారుగా బాబు గారు అని వచ్చేసరికి అనిరుధ్ చూసి “ఏమైంది!?” అని అడుగుతాడు…
మంగ చేతులు నలుపుకుంటూ “అమ్మాయిగారు ఇందాక ఎప్పుడో పడుకున్నారు కానీ ఇప్పటికీ ఎంత లేపిన లెగడం లేదు పైగా ఉల్లంతా చాలా వేడిగా ఉంది!???”అని చెప్పేసరికి
అనిరుద్ కంగారుగా వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తడు… అప్పుడే తిరిగే ఇంటికి రావాలని స్టార్ట్ అవుతున్న అగస్య తమ్ముడి కాల్ రాగానే ఫస్ట్ రింగ్‌కి లిఫ్ట్ చేసి…”ఆ చెప్పరా!?” అని అనేసరికి… అనిరుద్ కాస్త కంగారుగా అన్నయ్య నందు గారికి హెల్త్ బాగోలేనట్టుంది పడుకుంది చాలా ఫీవర్ గా కూడా ఉన్నట్టు ఉంది… కాస్త !?”అని చెప్పేలోపు… అగస్త్య కంగారుగా “అవునా నేను దగ్గరలోనే ఉన్నాను ఒక 10 మినిట్స్ లో వచ్చేస్తాను అలానే డాక్టర్ని కూడా తీసుకొస్తాను!!”అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ కి వెళ్తాడు….