ఫ్లైట్ దిగి …. వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాడు . అక్కడ డైరెక్ట్ గా లిఫ్ట్ లో రాఖి ఫ్లోర్ కి వెళ్లి .. అతని క్యాబిన్ లోకి వెళ్ళే సరికి …
అక్కడ జాను నీ కొడుతున్న ఒక అమ్మాయిని చూసి రాఖి కళ్ళు ఎరుపు ఎక్కాయి …. రాఖి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంది .
” హేయ్ … ” అని అరిచిన రాఖి అరుపుకి జాను కొట్టిన ఆ అమ్మాయి జడుసుకొని … భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసి …
డోర్ దగ్గర రుద్రున్ని తలపిస్తున్నట్టు ఉన్న రాఖి నీ చూసి … తన పై ప్రాణం పైన పోయినట్టు ఫీల్ అవుతు …. భయంతో అలాగే కట్టేలా బిగుసుకొని పోయింది.