New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శ్రీవల్లి ❤️ – 2

శ్రీవల్లి ❤️ – 2

ప్రతి క్లాసు రెండు మూడేళ్ళు పావనం చేస్తూ ప్రస్తుతం నాలుగనసరి స్కూల్ ఫైనల్ డింకి కొట్టించాడు.

 

చెల్లెలు తనకంటే తెలివిగలదై చదువులో తనని మించిపోయినందుకు, చిన్నప్పటినించి చెల్లెలంటే ఉన్న ద్వేషం మరింత పెరిగిందేతప్ప ఆవంతయినా తగ్గలేదు. తండ్రికూడా కరువయ్యాక పిల్లలిద్దరి భారం వహించాడు సరోజిని తండ్రి సుబ్బారావు. ఆయనకి విక్రమ్ ఒక సమస్య అయి కూర్చున్నాడు.

 

విక్రమ్‌లో తెలివితేటలు సున్న.

 

కోపాలు, పంతాలు మిన్న.

 

దీనిమూలంగా బాధ అనుభవిస్తున్నాడు ఆ ఇంట్లో మిగిలిన ఇద్దరూ- తాతా, మనుమరాలు.

 

తెలివైన శ్రీవల్లిని చూసి ఎంత మురిసిపోతాడో విక్రమ్‌ని చూసి అంత బాధపడతాడు సుబ్బారావు. తండ్రి తెలివితేటలు సొంతం చేసుకున్న శ్రీవల్లి మీద ఎంత ప్రేమ ఉందో అంత అసహ్యకరమూ విక్రమ్ మీద లేకపోలేదాయనకి. కానీ, అది సరిగా అర్థం చేసుకోలేని విక్రమ్ మనసు…

 

—

 

ఒరేయ్! విక్రమ్!

 

తాతయ్య పిలుపు విని, రోడ్డు కొలవడానికి పోతున్న విక్రమ్ చిరాగ్గా ముఖం పెట్టుకుని వచ్చాడు.

 

ఇలా రా! కూర్చో! మంచంమీద తనవక్క జాగా చూపించాడు సుబ్బారావు.

 

చూడు, విక్రమ్! నిన్ను బాధ పెట్టాలనికాని, చిన్నబుచ్చాలనికాని నా ఉద్దేశం కాదు. ఉన్న మాట చెపుతున్నాను. సరస్వతి దేవి కటాక్షం నీ మీద లేదు. నేనా – మృత్యువుకి చేరువవుతున్నవాడిని. నువ్వేదైనా పనిలో చేరడం మంచిది. నేను రేపు పావుకారు వెంకయ్యతో మాట్లాడతాను. వాళ్ళ కొట్టులో ఏదన్నా పని ఇప్పిస్తాడు.

 

విసుగ్గా లేచాడు విక్రమ్. ఏం పని ఇప్పిస్తావ్. కొట్టుకి కావల పడి కోవడమా.

 

సుబ్బారావు మీనసలాచాటున జీవితాన్ని కాచీ వడబోసిన చిరునవ్వుతో చూసింది.

 

ఊరికే బలాదూరు తిరగడంకంటే పరువు, మర్యాదలకి భంగం రాని ఏ చిన్న పని చేసుకు బ్రతికినా అది బ్రతుకే అవుతుందిరా. అందులో సిగ్గుపడవలసిందిగాని, బాధపడవలసిందిగాని ఏమి లేదు. సహజ శాంతస్వరం పచ్చి నిజాన్ని పలికింది.

 

నిర్లక్ష్యంగా, మౌనంగా అక్కడినించి వెళ్ళిపోయాడు విక్రమ్.

 

చూశావా, అమ్మా. వాడికి నువ్వన్నా, నేనన్నా ఎంత అలుసేమో. నా బాధ నాదేకాని వాడికి చీమ కుట్టినట్టయినా లేదు. ఎంతసేపూ సినిమాలు, పిక్చర్లు, ఆటలెప్పుడూ ఒకటేనాడయినా శ్రద్ధగా చదువుకుంటున్నాడా. శ్రద్ధగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, నలుగురి చేతా భేషనిపించుకోవాలి అన్న ఆలోచన వాడిలో ఎక్కడైనా ఉందా అసలు. అలాంటి ఉద్యోగం ఉన్నవాడైతే ఇలా ఎందుకుంటాడు. నాకా రోజులు దగ్గరపడుతున్నాయి. పోయేముందే నా వాడి దారిలో పడటం చూసి మరి కన్ను మూద్దామని ఈ ముసలిప్రాణం కొట్టుకుంటోంది, అంతేనమ్మా నా బాధ. నా మనసు కోరేదంతకంటే మరేమీ లేదు.

 

బాధ. నా మనసు కోరి దంతకంటే మరేమీ లేదు.

 

ఉప్పెనలా దుఃఖం ముంచుకువచ్చి రెండు నిమిషాల పాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు సుబ్బారావు.

 

వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి మెల్లిగా తాతయ్యచేత తాగించింది శ్రీవల్లి.

 

డాక్టరుగారేమో రెస్ట్ తీసుకోవాలి అంటారు. నువ్వేమో రోజూ గంటలకొద్దీ అన్నయ్యని గురించి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకుంటావు. మనసుకి శాంతి లేనిదే మనిషికి బలమెలా వస్తుంది తాతయ్యా అంటూ మనసులో వేదన మాటల్లో తెలిపింది శ్రీవల్లి.

 

పిచ్చిపిల్లా! వయసు ముదిరి వంగిపోయిన ఈ ముసలివాడి కింక బల మేమిటమ్మా! దేవుడైన ఆ రాముడు రమ్మంటే, తెంచుకోలేని బంధాలు ఉండమంటుంటే ఇహపరాలకి మధ్య ఇలా వేలాడుతోంది నా ప్రాణం.

 

సుబ్బారావు మాటల్లో వేదాంతం, మనసులో వేదన.

 

ఏమిటి, తాతయ్యా, అస్పమానం అలా మాట్లాడతావ్ అని శ్రీవల్లి కన్నుల్లో బాధ నింపిన నీరు.

 

మనవరాలి కన్నుల్లో నీరు చూసిన తాతయ్య మనసులో జాలి నింపిన ఆలోచనలు.

 

ఆప్యాయంగా మనవరాలి తలమీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయాడు సుబ్బారావు. ఆయన వైపు చూస్తూ అలానే కూర్చుండిపోయింది శ్రీవల్లి.

 

—

 

వారం రోజులు ఒక దానివెంట ఒకటి పరుగెత్తాయి.

 

ఎలాగైతేనేం ఆ రోజు విక్రమ్‌ని ఒప్పించి షావుకారు వెంకయ్య కొట్లొ సరుకుల పద్దు వ్రాసే పనిలో కుదిర్చాడు సుబ్బారావు.

 

తృప్తిగా ఉండచ్చు తాతయ్య, ఇంక నువ్వు అన్నయ్య గురించి ఆలోచిస్తూ విశ్రాంతి లేకుండా చేసుకోనక్కర్లేదు. అవునా అంటూ విక్రమ్ ఉద్యోగంలో చేరిన మరునాడు తాతయ్య ప్రసన్న కూర్చుంటూ మనసులో నిండిన మమతతో మనస్ఫూర్తిగా అంది శ్రీవల్లి.

 

అవునన్నట్టుగా తల ఊపాడు సుబ్బారావు.

 

జాగ్రత్తగా, తాతయ్యా, ఈ మధ్య నీకు నీరసం, దగ్గు మరీ ఎక్కువైపోయాయి. ఇంకొంచెం ఎక్కువగా లేచి తిరగడం మానేయ్.

 

బలేదానివి, మనవరాలా! కాలికి కాళ్ళు చాచి ఉన్న నన్ను, నీ దగ్గర ఎంతకాలమని కట్టేసుకోగలవు. నవ్వాడు. అదిగో మళ్ళీ మొదలుపెట్టావ్. లేనిపోని కోపం ప్రదర్శించబోయింది.

 

ఆ! సరేలే, అమ్మా! నీకు కష్టంగా ఉంటే ఇంకెప్పుడూ అలా అననే.

 

మరి! తాతయ్యా! మన పక్కింట్లోకి నిన్న కొత్తగా వచ్చారు చూడు, రఘురాం గారని, వాళ్ళమ్మాయి ఎంత ముద్దుగా ఉందనుకున్నావు. పొద్దున్న పిల్ల వాళ్ళ గుమ్మంలో నిలబడి ఉంటే రమ్మని పిలిచాను. సిగ్గుపడుతూ మెల్లిగా వచ్చింది. నీ పేరేమిటని అడిగితే అనన్య అంటూ రివ్వున పరుగెత్తి పోయింది.

 

 

ఆ మాటలు వింటున్న శ్రీవల్లి ముఖంలో చిరునవ్వు విరిసింది.

అంతలోనే గుమ్మం దగ్గర చిన్నగా అలికిడి వినిపించింది. ఇద్దరూ అటువైపు చూశారు. ఎదురింటి అనన్య చేతిలో చిన్న పూలగుత్తితో నిలబడి ఉంది.

శ్రీవల్లి వెంటనే బయటకు వెళ్లి ఆ పాపను లోపలికి తీసుకొచ్చింది. అనన్యను చూడగానే సుబ్బారావు ముఖంలోనూ సంతోషం కనిపించింది.

ఆ పాపతో కాసేపు ముచ్చటించిన ఆయన, శ్రీవల్లిని చూస్తూ మురిసిపోయాడు. ఇంట్లో ఇంతకాలంగా ఉన్న నిశ్శబ్దానికి ఆ చిన్నారి నవ్వులు కొత్త కళను తీసుకొచ్చాయి.

శ్రీవల్లికి కూడా ఆ పాపతో మంచి అనుబంధం ఏర్పడుతుందని అనిపించింది.