నిన్న మనం పాస్ ఇచ్చేసి వదిలేసాం కదా విక్కీ వైషు వీళ్ల దగ్గరికి వచ్చేద్దాం రండి.
వయ్యారం గా చున్ని తిప్పుతూ జడ అంతకంటే ఊపుతూ మెట్లు ఎక్కుతున్న వైషూ ని ఒక్క చిటిక వేసి ఆపేసాడు విక్కి.
వీడికి నేను పలకాల అది కూడా చిటికేసి మరి పిలిస్తే అని రేగిన మంటని చల్లార్చుకుంటూ ఇంకో రెండు స్టెప్స్ ఎక్కింది వైషు.
ఈలోపు ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి డ్రగ్ ఇచ్చి సొంతం చేసుకున్న యువకుడు,
అని యూట్యూబ్ లో రిపోర్టర్ చెపుతున్న న్యూస్ విని మూడో స్టెప్ మీద కాలు వేసేదల్లా ఆగిపోయింది.
అంటే విడి ఉద్దేశం ఇప్పుడు రేప్ చేస్తాడా నన్ను,
అసలే వీడికి దిక్కుమాలిన సిగరెట్ అలవాటు కూడా ఉంది అనుకుంటూ గబుక్కున వెనక్కి తిరిగింది వైషు.