నైట్ డిన్నర్ టైమ్ లో అదే విషయం గురించి రాఘవ గారు విరాజ్ తో చెప్తారు… విరాజ్ కూడా వద్దనడానికి పెద్దగా రీజన్స్ ఏవీ లేక సరే అంటాడు.. అలాగే పెళ్ళి గురించి ఒకసారి ఆలోచించు…నా ఫ్రెండ్ శంకర్ కూతురు ఉంది గా చాందిని… నీ క్లాస్ మేట్ ..ఆ అమ్మాయికి నిన్ను చేయాలనుకుంటూ నాకు ప్రపోజల్ పెట్టాడు. ఆ అమ్మాయి కి వంక పెట్టడానికి ఏం లేదు… పైగా మన తో సమానంగా ఉంటాయి వాళ్ళ ప్రాపర్టీస్…తను అనుకుంటే వాళ్ళ కంపెనీ CEO సీట్ లో కూర్చోవచ్చు కానీ తను ఓన్ గా తన టాలెంట్ ను బేస్ చేసుకుని మన కంపెనీ లో జాబ్ సంపాదించి నార్మల్ ఎంప్లాయ్ ల లైఫ్ లీడ్ చేస్తుంది… సచ్ ఎ సింపుల్ గర్ల్ షి ఇస్?? అందుకే నాకు నచ్చింది…నీకు కూడా నచ్చుతుంది .. టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. ముందు మీరిద్దరికీ ఒకరికి ఒకరు నచ్చాలి…సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే తను మన కంపెనీ లోనే ఉంటుంది … మాట్లాడు అని చెప్తారు… విరాజ్ కి అదంతా నచ్చట్లేదు…తన లైఫ్ మీద డెసిషన్స్ వేరొకరు తీసుకోవడం అస్సలు నచ్చట్లేదు… అది పేరెంట్స్ అయినా కూడా…కాకపోతే అక్కడ మాత్రం ఏం మాట్లాడకుండా డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళిపోతాడు…నందు వాడు ఒప్పుకున్నట్టేనా?? అని సందేహంగా అడిగారు రాఘవ . ఏమోనండీ నాకు మాత్రం ఏం తెలుసు?? అయిన వాడిని ఫోర్స్ చేయకండి … ఇంకా చాలా టైమ్ ఉంది గా అంటూ రాఘవ గారు తినేవరకు పక్కనే ఉండి తిన్నాక సావిత్రమ్మ హెల్ప్ తో అన్ని కిచెన్ లో పెట్టేసి కిందనే ఉన్న రూమ్ కి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళాక రాఘవ గారు శంకర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మరి ఇంకా ఒప్పుకోలేదు కదా రాఘవ అంటారు ఆయన ఇంకా అనుమానంగానే … రేయ్ ఇద్దరు ఇకనుండి ఒకే చోట ఉంటారు …చాందిని ని విరాజ్ PA గా అపాయింట్ చేస్తే వాళ్ళే క్లోజ్ అవుతారు అని చెప్తారు రాఘవ ..సరే రా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో విరాజ్ ఏ నా అల్లుడు అని ఫిక్స్ అయిపోయా …నన్ను నొప్పించకుండా వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీదే అంటూ ఇంకా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు.
రాఘవ గారిని పైన బాల్కనీ నుండి చూస్తూనే వున్న విరాజ్ ఫోన్ ఎవరికి చేశాడో ఏం మాట్లాడాడో ఊహించే ఉన్నాడు కనుక ఒక నవ్వు నవ్వి రూమ్ కి వెళ్ళిపోతాడు.
మరి ఆ నవ్వు కి అర్ధం ??
అలా విరాజ్ లైఫ్ లో 10 డేస్ గడిచి ఈ రోజు ఇక్కడ ఉన్నాడు …ఆలోచన లో ఉన్న గగన్ కి డోర్ సౌండ్ వినిపించి కమ్ ఇన్ అంటాడు. చాందిని లోపలికి వస్తుంది …చాలా అందంగా మోడర్న్ గా వన్ పీస్ డ్రెస్ లో పిచ్చ హాట్ గా ఉంటుంది….ఆమెని కింద నుండి పైకి చూసిన విరాజ్ … వాట్ అంటాడు .
హాయ్ విరాజ్…అప్పుడే నన్ను మర్చిపోయావా ?? మనం కాలేజ్ లో కలిసి చదువుకున్నాం ..పైగా మీ డాడీ మా డాడీ బెస్ట్ ఫ్రెండ్స్….అంటూ గుర్తు చేస్తుంది.
మిస్?? అంటూ ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూస్తే చాందిని అంటూ వయ్యారంగా విరాజ్ దగ్గరకి వస్తుంది. ఒకె మిస్. చాందిని …ఇది ఆఫీస్ అని మీకు గుర్తుందా ?? అన్నాడు.