తన వైపొస్తున్న ఆయుష్ వైపు అనుమానంగా చూస్తూ ఆషి కళ్ళు తిప్పి ఆయుష్ వైపు ఎన్టీ అన్నట్టు సైగ చేయడంతో ఎన్టీ అప్పుడే పడుకుంటున్నావ్ అంటూ ఆషి పక్కనే కూర్చుంటూ ఆషి చేతిని తన చేతిలోకి తీసుకుని రేపు అందరం షాపింగ్ కి వెళ్తున్నాం నీకు దియా కి కావాల్సినవి తీసుకో ఎవి మన స్టేటస్ కి తగ్గకుండా తీసుకో మన మ్యారేజ్ తర్వాత మహల్ లో జరిగే మొదటి శుభకార్యం కాబట్టీ ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదు నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి ఎంగేజ్మెంట్ మహల్ లోనే జరగబోతుంది కాబట్టి రేపటి నుంచి ఫుల్ వర్క్ ఉంటుంది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు దగ్గరుండి చేయించు
ఒకే ఆయుష్ గారు మీరు ఎమ్ కోప్పడను అంటే ఎంగేజ్మెంట్ కి అమ్మ నాన్న లను కూడా ఇన్వైట్ చేస్తాను మీకేం ప్రాబ్లెమ్ లేదు కదా
నాకేం ప్రాబ్లెమ్ లేదు బట్ వాళ్లు వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటే అందరికి బావుంటుంది కాదు అని ఇక్కడికి వచ్చాక నా కూతుర్ని తీసుకుని వెళ్తాం అని కానీ దియా ను సరిగ్గా ట్రీట్ చేయకపోయినా వాల్లొచ్చారని నువ్వు దియా ను పట్టించుకోకుండా వాల్ల దగ్గరే ఉంటే అందరి ముందు నాలో వున్న రాక్షసుడు మరో సారి బయటకు వస్తాడు అంటూ సిరియస్ గా చెప్తాడు
ఈ బీస్ట్ అన్నంత పని చేస్తాడు అమ్మ నాన్న లను పిలిచినా వాళ్లతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేను వీడు చేయనివ్వడు ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక సారి అమ్మ వాళ్ళింటికి వెళ్ళి టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు అభి ను ఒకటే పిలవడం బెటర్