New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అజేయ

38 stories Ongoing Thriller Love Historical

                   **   అజేయ  -   1 **లండన్ మహా నగరంలో  అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న  , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది..లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో  నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు..అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల ఒకే దృశ్యం వేల రెట్ల వేగంతో మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతోంది...అది ఒక యుద్ధభూమి.. కొన్ని వేల గుర్రాల కాలి గిట్టాలా శబ్దాలు, కత్తుల ఘర్షణ,చుట్టూ రక్తపాతం..ఆ మారణహోమం మధ్యలో ఒక దివ్యమైన, నల్లటి కాంతితో మెరుస్తున్న ఒక పాత ఖడ్గం...ఆ కత్తి పిడిపై ఒక సింహం…

Browse Stories

అజేయ Premium

అజేయ – 28

        **   అజేయ  –  28 **   అదే సమయం లో..పైకి అత్యంత మోడ్రన్ గా, ప్రాక్టికల్ గా, మరియు ఎమోషన్స్ లేని ఒక బిజినెస్ ఉమెన్‌లా కనిపించే సియా…    ఆ పెయింటింగ్ వైపు చూస్తున్నప్పుడు ఆమె లోపల ఒక వింతైన అలజడి మొదలైంది.. సియా  మైండ్ లోకి తను ప్రొట్రైట్ వేస్తున్నప్పటి ఆ విజువల్స్ తన కళ్ళ ముందు కనిపిస్తుంటే..ఒక తెలియని గందరగోళం సియా మనసులోకి దూసుకొచ్చింది..   ఒక […]

3 min 13 views
అజేయ Premium

అజేయ – 27

            **   అజేయ  –   27**     ఆ ముఖం మరెవరిదో కాదు… సరిగ్గా ఇప్పుడు లండన్ నుండి వస్తున్న రాఘవ్ ముఖమే!   ఫ్లైట్ లో ఉన్న రాఘవ్ కి సడన్‌గా గుండెల్లో ఒక వింత చలనం వచ్చింది..   ఎప్పుడూ లేని విధంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అతని శరీరం అంతా పాకింది..అతను విండో బయట ఉన్న నల్లటి ఆకాశాన్ని చూస్తూ,   “ఎవరు నువ్వు? […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 26

      **   అజేయ  –  26 **     ఈ లండన్ నగరం అతనికి ఒక లగ్జరీ లైఫ్ ఇచ్చింది. లండన్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత స్థాయి ప్రొఫెసర్ ఉద్యోగం, సమాజంలో ఒక ఎలైట్ గౌరవం, ఒక ప్రశాంతమైన భవిష్యత్తు…    అన్నీ ఇక్కడే ఉన్నాయి.కానీ ఆ క్షణంలో… ఆ మోడ్రన్ లైఫ్ మొత్తాన్ని తను వెనక్కి వదిలేస్తున్నాడనే నిజం రాఘవ్‌కు అర్థమైంది..   ఆ ఉద్యోగం, ఆ హోదా, ఆ విలాసవంతమైన లండన్ సామ్రాజ్యం… […]

3 min 12 views
అజేయ Premium

అజేయ – 25

          **   అజేయ  –   25**     స్క్రీన్ మీద కనిపిస్తున్న ‘Unknown Number’ నీ చూస్తూ.. భృకుటి ముడి వేసిన రాఘవ్ నడక ఆపకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటూ..   “హలో,హు ఇస్ థిస్ ” అన్నాడు చాలా క్యాజువల్ గా..   అవతల వైపు నుండి ఒక వింతైన, గంభీరమైన వాయిస్ వినిపించింది.. ఆ వాయిస్ లో ఒక రకమైన క్రూరత్వం, మైండ్ […]

4 min 10 views
అజేయ Premium

అజేయ – 24

      **   అజేయ  –  24 **     ఆ బ్యాగ్‌లోని పుస్తకాలు, నోట్స్ కేవలం కాగితాలు కావు… శతాబ్దాల క్రితం ఆగిపోయిన తన ప్రేమ సామ్రాజ్యానికి దారి చూపే మ్యాప్స్ అని అతనికి తెలుసు..   కానీ మరొక ఆఫీసర్ రాఘవ్ యొక్క మరొక బ్యాగ్‌ని ఓపెన్ చేసి, అందులో ఉన్న ఆ పాత లండన్ యూనివర్సిటీ సీల్ ఉన్న పేపర్స్, వింతైన రేఖాచిత్రాలు, మరియు ఒక పాత మెటల్ కాయిన్‌ని బయటకు […]

3 min 8 views
అజేయ Premium

అజేయ – 23

           **   అజేయ  – 23  **       ఆ హడావుడి వాతావరణంలోకి రాఘవ్ చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా అడుగుపెట్టాడు. అతని బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడా ఎలాంటి కంగారు లేదు..   రాఘవ్ వంతు వచ్చింది..అతను నేరుగా ఖాళీగా ఉన్న ఒక స్కానింగ్ బెల్ట్ దగ్గరకు వచ్చాడు. తన కుడి భుజానికి ఉన్న  హ్యాండ్-క్రాఫ్టెడ్ లెదర్ ట్రావెల్ బ్యాగ్‌ ‌ను బెల్ట్ పక్కనే ఉన్న ఒక గ్రే కలర్ ప్లాస్టిక్ […]

3 min 11 views
అజేయ Premium

అజేయ – 22

**   అజేయ  –   22**   రాఘవ్  ఆ అమ్మాయి ముఖం ఉన్న రఫ్ స్కెచ్ వైపు చూస్తూ, ఎవరు నువ్వు? శతాబ్దాల దూరాన్ని దాటి నీ గొంతు నన్ను ఎందుకు అంతలా వెంటాడుతోంది? అని అనుకుంటున్న రాఘవ్ కి  ఇప్పుడు  ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది..   ఈ ప్రయాణానికి అసలైన లీడర్ తను కాదు… తనను వెనక్కి లాగుతున్న ఆ అమ్మాయి ప్రేమ!    ఆ ‘అజేయ’ ఖడ్గాన్ని కనిపెట్టడం, ఆ అంతర్జాతీయ […]

3 min 14 views
అజేయ Premium

అజేయ – 21

        **   అజేయ  – 21 **       ఆమె గొంతు ఆ బుక్ స్టోర్ నిశ్శబ్దంలో చాలా ఇంటెన్స్‌గా వినిపిస్తుంటే…”నువ్వు దేన్నైతే ప్రతిరోజూ వచ్చే ఒక సాధారణ కల అనుకుంటున్నావో… అది నీ భ్రమ కాదు రాఘవ్..   అది నీ భవిష్యత్తును, ఈ ప్రపంచాన్ని మార్చబోయే ఒక భయంకరమైన నిజం! కాలం తన సర్కిల్‌ను పూర్తి చేయడానికి నిన్ను మళ్లీ వెనక్కి పిలుస్తోంది. నువ్వు పుట్టిన నేల వైపు […]

3 min 10 views
అజేయ Premium

అజేయ – 20

**   అజేయ  –  20 **   ఆ న్యూస్ పేపర్ వెనుక దాగి ఉన్న వ్యక్తి సాధారణ ప్రయాణికుడు కాదని అతని సిక్స్త్ సెన్స్  కి క్లియర్ గా అర్థమైంది.. కానీ రాఘవ్ తన అటిట్యూడ్ అండ్ క్లాస్ స్వగ్‌ని ఎక్కడా డ్రాప్ చేయలేదు..   వాడిని గట్టిగా నిలదీసి సీన్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే, శత్రువు ఎవరో తెలియనప్పుడు… మనం కూడా నార్మల్ గానే యాక్ట్ చేయాలి అనేది అతని మైండ్ గేమ్ ప్లాన్..   […]

4 min 23 views
అజేయ Premium

అజేయ – 19

              **   అజేయ  –   19 **             రాఘవ్ ఇండియాకు వెళ్తున్నది కేవలం ఒక రీసెర్చ్ పేపర్ కోసమో, లేదా వెకేషన్ కోసమో కాదు. తనని ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న ఆ కలలోని రహస్యాన్ని చేధించడానికి..   I am not searching for history, history is pulling me back, అని అతని అంతరాత్మ  అతనికి […]

3 min 19 views