New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడలి – 4
కడలి 3 min read

కడలి – 4

చూస్తూ చూస్తూ రాత్రి కరిగి తెల్లారుతోంది. రాత్రి అనగా వెళ్లిన మనిషి ఇంతవరకు జాడ లేరు. ఒళ్ళంతా కంగారుతో చల్లపడిపోతోంది ఆమెకు.వంశిక దగ్గర ఫోన్ లేక డ్రెస్ మార్చుకొని కిందున్న రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కాల్ కోసం ఫోన్ అడిగింది.

 

ఎగాదిగా చూసిన రిసెప్షనిస్ట్ ల్యాండ్ లైన్ ఆమె ముందుకి నెట్టింది.

 

అతడి నెంబర్ ఆమె దగ్గర లేక  గుర్తున్న ఇంకో నెంబర్ కి కాల్ చేసింది కాని అది స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆమె భయం ఇంకాస్త పెరిగింది.

 

మరో ఆలోచన చేయకుండా రూంలోకి పరిగెత్తిన వచ్చేప్పుడు వాళ్ళ అమ్మ చేతిలోకి ఇచ్చిన వెయ్యి తీసుకొని బయటకు వచ్చి రాత్రి హరిణిని దించిన హాస్టల్ దగ్గరకు స్టార్ట్ అయ్యింది.

 

రాత్రి పగలు తేడా లేక ఎప్పుడూ హడావిడిగా ఉండే భాగ్యనగరంలో రాత్రి హరిణిని వదిలిన హాస్టల్ అడ్రెస్ బాగానే గుర్తుపెట్టుకుంది వంశీ.

 

హాస్టల్ ముందు ఆటో డిగిన ఆమె అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయంటే హాస్టల్ లోకి ఎంటర్ అవుతున్న స్కూటీ కూడా ఆమె వేగానికి వెనక పడిపోయింది.

 

రాత్రి ఆమె చూసిన వార్డెన్ కోసం మొత్తం చూసిన వంశీకి కాంటీన్ దగ్గర ఎవరినో తిడుతూ కనిపిస్తోంది.

 

ఆమె వచ్చే వరకు కొంచం ఓపిగ్గానే చూసిన వంశిక ఆమె దగ్గరకు రావడంతో హరిణి గురించి అడుగుతుంది.

 

హరిణి నా!? అలాంటి వాళ్లెవరు ఇక్కడ లేరని తేల్చి చెప్పేసిన ఆ వార్డెన్ ఇక వంశిక ని వెళ్లిపొమ్మని చెయ్యి పట్టి బయటకు జరుపుతుంది.

 

హరిణి తెలియదంటారు ఏంటి!? ఆశ్చర్యంతో పాటుగా కోపం కూడా సమపాళాల్లో పెళ్ళుబికింది ఆమెలో.

 

తెలియకపోవడం ఏంటండి? రాత్రే కదా వాళ్ళ అన్నయ్య వచ్చి దించి వెళ్లారు.

 

రాత్రి ఇక్కడికి అలాంటి వాళ్లెవరు రాలేదు.

 

ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి మేడం. రాత్రి ఓ పొడుగ్గా ఉన్న వ్యక్తి స్కై బ్లూ షర్ట్ వేసుకున్నారు, అమ్మాయేమో యెల్లో కలర్ చుడిదార్ వేసుకుందని వార్డెన్ ముందు ఏకరువు పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది వంశిక పరిస్థితి.

 

వంశిక పరిస్థితికి జాలేసిందో లేక ఇంకేదైనా అనుకుందో కానీ ఆ అమ్మాయితో నీకేం పనని అడిగింది ఆ వార్డెన్.

 

తను నా ఆడపడుచు మేడం. రాత్రి నుండి వాళ్ళ అన్నయ్య తిరిగి రాలేదని జరిగింది మొత్తం చెప్పిన వంశిక ఇప్పటికైనా తను ఉంటే పిలవండి మేడం అని అడుగుతుంది.

 

ఉంటే పిలిచేదాన్నే అమ్మాయ్. కాని ఆ అమ్మాయి మా హాస్టల్ లో ఉండే పిల్ల కాదు. ఎవరినో చేర్చడానికి హాస్టల్ వివరాలు అడగడానికి వచ్చామని కొన్ని ప్రశ్నలు అడిగి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.

 

అతడు వెళ్లిన ఐదు, పది నిమిషాలకు ఓ కార్ వస్తే ఆ అమ్మాయి అందులో ఎక్కి వెళ్ళిపోయింది. చూడపోతే నువ్వు మోసపోయావ్ అనిపిస్తోంది. వాళ్లెవరి నంబర్స్ నీ దగ్గర లేవాని సదరు మహిళగా ఇలాంటి సంఘటనలు చూసిన అనుభవమున్న వ్యక్తిగా జాలిగా అడుగుతుంది ఆ వార్డెన్.

 

వార్డెన్ చెప్పింది విన్న తర్వాత ఆమె మనసు మొద్దుబారిపోయి,మెదడు స్తబ్దుగా మిగిలిపోతుంది కాసేపు.

 

మళ్ళీ వార్డెన్ పిలిచిన పిలుపుకు తేరుకున్న వంశిక  మీ ఫోన్ ఒకసారి ఇస్తారాని అడిగి ఆమె ఇచ్చాక మళ్ళీ తనకి తెలిసిన నెంబర్ కి డైల్ చేసింది.

 

ఈసారి అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి వంశిక చెప్పింది మొత్తం వింటారు.

 

 

హోటల్ రూంలో గోడకి ఆనుకుని ఉన్న వంశిక నే తీక్షణంగా చూస్తున్నారు ఆమె తండ్రి సుదర్శన్ గారు.

 

మౌనంగా తల వంచుకొని నిలబడ్డ వంశిక కళ్లలో నీటి చెమ్మ లేదు కాని అగ్నిగోళాలని తలపించేలా ఉన్నాయి.

 

అన్నయ్య నువ్వు మన అమ్మాయిని అంటే ఎలా అన్నయ్య. తప్పు చేసింది మనం, మోసం చేసింది వాడు. మధ్యలో అన్యాయం అయిపోయిన దాన్ని పట్టుకుని ఎందుకన్నయ్య అన్ని మాటలు అంటున్నావ్?

 

నాకు మాత్రం దాన్ని అనాలని సరదాన రఘు !?  ఇదేం చేయకుంటే, ఇదేం అనకుంటే ఆయనెందుకు వెళ్ళిపోతారు? కచ్చితంగా ఇదే ఏదో అనుంటుంది.

 

వంశికలో ఎక్కడో ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది ఆయన మాటలకు.

 

ఇప్పుడేం చేద్దాం అన్నయ్య మరి. పోలీస్ కంప్లైంట్  ఇద్దామా?

 

ఎందుకు ఉన్న పరువు బజారులో పెట్టుకోడానికా? 

 

సరే అమ్మాయిని మనతో పాటుగా ఊరికి తీసుకెళ్లిపోదాం.

 

ఇంకా నయం నన్ను ఉరిపోసుకోమనలేదు!!

 

అన్నయ్య! ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు. ఇప్పుడేం అంత అయిపోయిందని??

 

ఇంతంటే ఇంకేం కావాలి రఘు. ఈ సుదర్శన్ కనీసం కూతురికి మంచి సంబంధం కూడా తెచ్చి పెళ్లి చేయలేడాని మన ఊర్లో అందరూ కోడయ్ కూస్తారు.

 

అన్నయ్య ఊర్లో జనాల కోసం మన బిడ్డని మనం అన్యాయం చేసుకుంటామా?

 

రఘు నువ్వు మర్చిపోయినట్టున్నావ్. నాకున్నది ఈ ఒక్కటే కాదు. తన వెనక ఇంకా ముగ్గురు ఆడపిల్లలున్నారు.

 

నాకు తెలుసన్నయ్య. కాని మన వంశీ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా.

 

కాసేపు మౌనంగా ఉన్న సుదర్శన్ గారు తనని  కాలేజ్ హాస్టల్ లో దించేసి రా రఘు. 

 

ఓ క్షణం గాల్లో తేలిన అనుభూతి కలిగింది వంశికకి.

 

వంశి ని చూసిన రఘుకి ఆమేదో సైగ చేయగా అన్నయ్య మరేమో ఎలాగో తను చదువుకోడానికి పంపమన్నావ్ కదా. అందుకే…

 

హా! అందుకు..?

 

 

సశేషం… ❤️

 

ఎలా ఉందో చెప్పండి యార్… 🥰