కడలి – 3
అది చూడగానే ఎందుకో మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది ఆమెకు . ఏమరపాటుగా ఎదురుగా ఉన్న అనిరుధ్ ని చూసింది . ఎప్పటినుండి చూస్తున్నాడో తెలియదు కాని ఆమెనే గమనిస్తున్నాడు.
చూపుదించి అతడి ప్లేట్ వంక చూసి తినేసినట్టున్నారు అనుకున్న వంశీ వెళ్దామా అని అడిగింది ఇక అక్కడి వాతావరణం ఆశ్వాదించే మూడ్ లేక.
మారు మాట్లాడలేదు అతడు . చైర్ నుండి లేచి ముందుకు నడుస్తున్న అతడ్ని అనుసరిస్తూన్న వంశిక వెనకున్న హోర్డింగ్ ఓసారి చూసి ముందుకు తిరిగి మొదలుపెట్టిన ఆమె నడక ఇక ఆగింది రూంలోనే.
ఏదో ఆలోచనలో వచ్చేసింది కాని వచ్చాకే అర్థం అయింది. అసలు అక్కడ జరగాల్సిన కార్యక్రమం ఏంటా అని.
భయం ఆమెను వదలని నీడలా మళ్ళీ వంశికని వెంటాడుతోంది. ఆమె ఆ భయంలో ఉండగానే వంశిక అని గంభీరంగా వినిపించింది అనిరుథ్ గొంతు.
ఏంటని చిన్నగా కళ్ళు మాత్రమే ఎత్తిన ఆమెతో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు అనిరుథ్.
ఏం చెప్పకుండా రూంలో ఉంచి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వంశికకి కానీ కాసేపు మనసుని స్థిమిత పరుచుకొని ఆమె చెప్పాలనుకున్న విషయం ఎలా చెప్పాలా అని రెహర్సెల్స్ చేస్తూ ఎదురుచూస్తున్న ఆమెకు మిగిలింది??
ఆమెను రూంలోనే ఉండమని అతడు ఎక్కడికి వెళ్లాడో అర్థం కాలేదు వంశీకి .
ఇప్పుడు అవన్నీ ఆలోచించే స్థితిలో కూడా లేను ఆమెకి ఆ గదిని చూస్తుంటేనే ఒళ్ళంతా అదోలా అయిపోతోంది. కారణం పెళ్లంటేనే ఇష్టంలేని ఆమెకు ఇప్పుడు జరిగే కార్యం మాత్రం ఎలా సమ్మతంగా ఉంటుంది.
కాసేపు అతడు లేని ఆ ఏకాంత ప్రశాంతాన్ని ఆస్వాదించాలి అనిపించి రూం డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్లిన వంశికకి మళ్ళీ అదే హోర్డింగ్ ఆమె మూడ్ మొత్తం ఆవిరి చేసేసింది.
అసహనం ఆమె పాదాలను దాటి తలకెక్కి బుర్రలో చోటులేదని ఆలోచనల సుడిగుండాలని కన్నీళ్లగా బయటకు పంపేస్తోంది ఆమె మనసు కళ్ళ సాయంతో.
కొన్ని జ్ఞాపకాలు అంతేనేమో ఎంత మర్చిపోవాలి అనుకున్నా మనసును వీడి పోనని మోరాయిస్తాయి.
కింద కూర్చోని మంచానికి అనుకోని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి.
అప్పుడు వంశీ వయసు పదేళ్లు అనుకుంటా. భుజానికి రెండుపక్కలా ఓ క్లిప్ బ్యాగ్ తగిలించుకుని, వాళ్ళ అమ్మ స్కూల్ కి వెళ్లే ముందు మొట్టికాయ వేసి మరీ ఎర్ర రిబ్బన్లతో పైకి కట్టిన రెండు జాడల్లో ఒకటి కుచ్చిళ్ళు ఊడిపోయి,ఇంకోటి పూర్తిగా ఊడిపోయి కిందకి వేలాడుతుంటే,ఓ చేతిలో వైర్లతో అల్లిన బుట్టలో కోకోకోలా బాటిల్ లో సగం ఖాళీ అయిన నీళ్లు, ఓ స్టీల్ క్యారేజ్ లో సగానికి పైగానే వదిలేసిన అన్నాన్ని పక్కనే ఉన్న కాలువలో వేద్దామని చుట్టూ చూస్తూ జాగ్రత్తగా నడుస్తోంది.
ఓ చోట ఆగి ఎవరూ లేరని నిర్దారణ అయ్యాక బాక్స్ లో అన్నం రోడ్డు పక్క పడేసి ముందుకు వెళ్ళబోతుంటే సిక్సర్ అని గోడ పక్కన్నుండి వినిపించింది ఓ పెద్ద అరుపు.
ఆత్రుతగా తల పైకి ఎత్తి చుట్టూ చూసింది కాని ఆమెకు అక్కడ ఏమి కనిపించలేదు అసలు.
ఎవరూ లేరని మళ్ళీ నడక ప్రారంభించిన వంశీకి ఈసారి ఫోర్ అని వినిపించింది. చిన్నగా గమనిస్తే అది ఆ పెద్ద గోడ అవతల నుండి వచ్చిందని అర్థం అయ్యి ఏం జరిగితోందో అవతల చూడాలని ఆత్రం పెరిగిపోయింది తనకు .
ఆ గోడ ఆమె కంటే ఎత్తుగా ఉంది. చుట్టూ చూసింది ఎక్కడ ఒక్క రాయి కూడా కనిపించలేదు.అయ్యో అనుకోని వెళ్తుంటే ఓ భుజం ఆసరా దొరికింది.
ఎవరా అని చూస్తే ఆమె క్రైమ్ పార్ట్నర్. అతడిని చూసి ఓ నవ్వు నవ్వేసిన గోడ అవతలకు తొంగి చూస్తే ఓ చిన్న కౌంపౌండ్. చుట్టూ నాలుగు గోడల మీద ఫోర్, సిక్స్ అని నాము గడ్డతో రాసినట్టున్నారు.
ఓ పదిమంది రెండు టీమ్స్ గా విడిపోయి క్రికెట్ ఆడుతున్నారు.
ఒరేయ్ ఇందాకటి నుండి నువ్వే బాటింగ్ చేస్తున్నావ్. ఓసారి ఇవ్వరా అని చాలాసేపటి నుండి బతిమాలుతున్నాడు ఓ అబ్బాయి.
ఆమ్మో నీకు బాట్ ఇస్తే ఇక మాకు రాదు. కాసేపు ఆడి ఇస్తానని ఆ అబ్బాయిని పక్కకి జరిపి తన ఆటలో మునిగిపోయాడు అతడు.
ఆ అబ్బాయి మొహం చూస్తే జాలి అనిపించి అయ్యో పాపం అని కూడా అనుకుంది.
మరో రెండు బాల్స్ కే బాట్ ఇవ్వను అన్న అతడు అవుట్ అయ్యి ఈసారి బాటింగ్ ఛాన్స్ ఆ అబ్బాయికి వచ్చింది.
ఆ అబ్బాయి బాటింగ్ మొదలు పెట్టగానే అందరి మొహాల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది.ఎందుకో మరి.
ఫస్ట్ బాల్ వేసాడు బౌలర్. అది మిస్ చేశాడు. ఒప్పొసిట్ టీం మొహాలు సంతోషంతో విప్పారాయి.
ఆ ఎక్స్రెషన్ నచ్చలేదన్నట్టు మొహం పెట్టిన ఆ అబ్బాయి ఈసారి వేసిన బాల్ సిక్స్ కొట్టాడు. అంతే ఇక ఎక్కడ ఆగలేదు. ఒక్కో బాల్ ని దుమ్ము దులిపేస్తున్నాడు.
ఎందుకో అతడు అలా షాట్స్ తీస్తుంటే ఆమెకు ఎక్స్కైట్మెంట్ ఎక్కువ అయిపోతోంది.
ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ అని వెనక వినపడిన గొంతుకి వంశిక గుండెజారి కడుపులోకి వచ్చిందంటే నమ్మరు..
కలత నిద్రలో పక్కకు ఒరిగిపోయిందేమో గబిక్కున మెలకువ వచ్చేసింది. టైమ్ చూస్తే అర్ధరాత్రి రెండు గంటలు చూపిస్తుంటే అనిరుథ్ వచ్చాడేమో అని గదంతా కలయ చూసింది కాని ఎక్కడ జాడ లేదే.
కింద రిసెప్షన్ కి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు అతడు ఇంకా రాలేదనే చెప్పారు. ఎందుకో కంగారుగా అనిపించింది వంశీకి
బిక్కుబిక్కు మంటూ ఆ రూంలో ఒక్కత్తే ఉంది. కొత్త చోటు. చేతిలో ఒక్క రూపాయి లేదు.ఒంటి మీద ఓ బంగారు గొలుసు, నల్లపూసలు తప్ప మరో బంగారం లేదు.ఆమెకు లేక తెచ్చుకోకపోవడం కాదు. వాళ్ళ అమ్మ అన్నీ సర్దుతుంటే ఇప్పుడు అవేం వద్దని అనిరుథ్ వారించటంతో నాలుగు జతల బట్టలున్న బ్యాగ్ చేతిలో పట్టుకొని అతడి వెంట వచ్చేసింది ఆమె.
ఇంకాసేపు వేచి ఉండడం తప్ప మరో దారి కనిపించట్లేదు వంశీ కి.
రాత్రి కరిగి తెల్లారు అయ్యి ఆమె జీవితంలో మరో రోజు తెచ్చింది.ఇప్పటికీ అనిరుథ్ రాకుంటే ఆమెలోని ఆలోచనలు ఎటువైపుకో మళ్లుతున్నాయి.
సశేషం… ❤️
కామెంట్స్ ప్లీజ్ 🥰
Swipe left/right or tap the sides to turn pages