నీ ప్రేమకు మరో రూపం
కొన్ని ప్రేమకథలు పెళ్లితో ముగియవు... మరణం తర్వాత కూడా ఒకరి జ్ఞాపకాలతో మరొకరు బతుకుతారు. ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. అప్పుడప్పుడూ మెరుస్తున్న మెరుపులు, ఉరుములు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్నాయి. హాస్పిటల్ కారిడార్‌లో ఓ అమ్మాయి చేతిలో ఒక రిపోర్ట్ పట్టుకుని కూర్చుంది.ఆమె పేరు అక్షర. కళ్లలో నీళ్లు, మనసులో చెప్పలేనంత బాధ. చేతిలో ఉన్న రిపోర్ట్ వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆ రిపోర్ట్‌లో ఉన్న విషయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది.ఆమె తల్లి కాబోతోంది.4 మంత్స్ ప్రెగ్నెంట్...... కానీ ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన వ్యక్తి మాత్రం ఆమె దగ్గర లేడు.ఒక్కసారి కళ్లు మూసుకోగానే అరుణ్ నవ్వుతున్న ముఖం గుర్తొచ్చింది. "అక్షరా... ఏంటి మేడమ్! ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ…