New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
I AM MAD ABOUT YOU…(RADHI 🖤) – 1

I AM MAD ABOUT YOU…(RADHI 🖤) – 1

 

 

 

NOTE :-(( ఈ కథ పై పూర్తి హక్కుల నవ్వే , కథను ఏ ప్లాట్ఫారం లో ఐనా &ఏ ఫార్మేట్ లో ఐనా కాపీ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను, LUCKY KOUTHAVARAPU..))

 

 

హైదరాబాద్,, యాడ్ సెట్..

 

 

​యాడ్ షూటింగ్ జరుగుతుంది. ఆ ప్రదేశం మొత్తం “క్రిష్…. క్రిష్…” అని ఫ్యాన్స్ అరుస్తున్నారు. మీడియా మొత్తం హీరో ఫొటోస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 

 

​లోపల, “ఎవయ్యా.. ఈ మీడియా రిపోర్టర్స్‌కి, ఫ్యాన్స్‌కి ఎలా తెలిసింది అంటావ్ హీరో గారు వస్తున్నారు అని?” అని డైరెక్టర్ గారు తన అసిస్టెంట్‌ని అడిగాడు.

 

 

​”మీరే అన్నారు కదా సార్.. ఫ్యాన్స్ అని! తమ హీరోలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఈజీగా తెలుసుకుంటారు.”

 

 

​”హమ్… అది నిజమే నాయ్యా! హీరోలు ఎక్కడ ఉన్నారో మనకి కూడా తెలీదు, ఫ్యాన్స్‌ని అడిగితే చెప్పేస్తారు.”

 

 

​”అవును సార్” అన్నాడు అసిస్టెంట్.

 

 

​”సరే గాని షూటింగ్ కి అంతా రెడీనా? హీరో గారికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నావా?” అడిగాడు డైరెక్టర్.

 

 

​”హా.. సార్ మొత్తం రెడీగా ఉంది. హీరో గారు రావడమే లేట్.”

 

 

​”మళ్ళీ ఒకసారి చెక్ చేయవయ్యా! ఎన్నో మంత్స్ నుంచి యాడ్ లో యాక్ట్ చేయమని అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు హీరో గారు. దానికి తోడు ఇదే సార్ ది ఫస్ట్ యాడ్. ఎప్పుడు సార్ తో యాడ్ కోసం అప్రోచ్ అవుదామని ఎంతో మంది డైరెక్టర్స్ ట్రై చేసినా వాళ్ళని కలవలేదు అంట. సో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకో…”

 

 

​”సరే సార్” అని అసిస్టెంట్ వెళ్ళాడు.

 

 

​&&&&&&&&&&&&&&&&&&&&&

 

 

​హీరో గారి కార్ సెట్ లోకి ఎంటర్ అయింది. ఫ్యాన్స్ అరుపులు ఇంకా ఎక్కువయ్యాయి. రిపోర్టర్స్ కెమెరాలు పట్టుకొని ఫొటోస్ తీయడం కోసం సిద్ధంగా ఉన్నారు.

 

 

​బెంజ్ కార్ లో నుంచి బ్లాక్ ఫార్మల్ డ్రెస్ లో, బ్రాండెడ్ షూస్, వాచ్, సన్‌గ్లాసెస్ పెట్టుకొని ఉన్న 6.4 హైట్, ఫెయిర్ స్కిన్ టోన్, నీలం కనుపాపలు కలిగిన షార్ప్ ఐస్, వి షేప్ జా లైన్, సిక్స్ ప్యాక్ బాడీతో ఒక హ్యాండ్సమ్ హంక్ దిగాడు. షర్ట్ పై మూడు బటన్స్ విప్పేయడంతో అతని బాడీ ఇంకా క్లియర్‌గా కనిపిస్తోంది. లైట్‌గా ట్రిమ్ చేసిన గడ్డం, ఒత్తైన జుట్టు.. చంద్రుడికే అసూయ పుట్టేంత అందం అతనిది.

 

 

​కార్ దిగి తన ఫ్యాన్స్‌కి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. అంతే! అతని చూపు కోసం పడి చచ్చిపోయే లేడీ ఫ్యాన్స్ “నా కోసమే నవ్వాడు” అని సంబరపడిపోయారు. రిపోర్టర్స్ ఇంకా వేగంగా కెమెరాలతో ఫొటోస్ తీసే పనిలో పడ్డారు.

 

 

​గ్లాసెస్ తీసి సెట్ లోపలికి నడుస్తూ, “జాన్.. ఇక్కడ జస్ట్ 15 మినిట్స్‌లో అంతా క్లియర్ అయిపోవాలి” అని గంభీరమైన బేస్ వాయిస్‌తో తన పి.ఏ కి చెప్పాడు.

 

 

​”ఓకే సార్! మీరు వెళ్ళి కాస్ట్యూమ్ మార్చుకొని రండి” అని క్యారవాన్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.

 

 

​తరువాత హీరో గారు చెప్పిన పని పూర్తి చేసి, డైరెక్టర్‌ని కలిసి షూట్ అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోవడంతో మళ్ళీ హీరో క్యారవాన్ దగ్గరకు వెళ్ళి..

 

 

​”ఆల్ సెట్ సార్” అని చెప్పాడు.

 

 

​అప్పటికే కాస్ట్యూమ్ మార్చుకొని రెడీగా ఉండి, ఫోన్ లో మెయిల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు క్రిష్.

 

 

​జాన్ పిలవడంతో షూటింగ్ స్పాట్ కి వెళ్ళి యాడ్ విజయవంతంగా పూర్తి చేసి, మళ్ళీ డ్రెస్ చేంజ్ కోసం వెళ్ళాడు.

 

 

​క్యారవాన్‌కి వెళ్ళిన హీరో షర్ట్ బటన్స్ విప్పుతూ ఉన్నాడు. అప్పుడే అతని వెనక నుంచి ఎవరో హగ్ చేసుకోబోయారు. వితిన్ ఏ మినిట్.. అసలు హగ్ చేసుకోనివ్వకుండానే అతను పక్కకు జరిగాడు.

 

 

ఇంకేముంది.. ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న సోఫాని ముద్దాడింది!

 

 

​”డోంట్ యు డేర్!” అని బేస్ వాయిస్‌తో హెచ్చరించాడు.

 

 

​ఆ వాయిస్‌లోని గంభీరత్వానికి ఆ అమ్మాయి భయపడి సోఫాలోంచి లేచి నిలబడి చూస్తూ ఉంది.

 

 

​సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుని, ఆ అమ్మాయి వైపు రెండు నిమిషాలు చూశాడు క్రిష్. ఆ పాప క్లీవేజ్ మొత్తం కనపడేలా, చిన్న పిల్లల సైజ్ లాంటి ఒక మినీ డ్రెస్ వేసుకొని ఉంది.

 

 

​ఫోన్ చూస్తూ, “వాట్ డు యు వాంట్?” అని బేస్ ఏమాత్రం తగ్గకుండా అడిగాడు.

 

 

​ఆ అమ్మాయి లోపల భయపడుతున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ..

 

 

​”అది ఏంటి క్రిష్….” అని ఏదో అనేలోపే..

 

 

​”డోంట్ యు డేర్! టంగ్ కట్ చేస్తా.. కాల్ మీ సార్!” అని గర్జించాడు.

 

 

​”అదే క్రిష్ సార్.. మీ అవసరాలు నేను తీరుస్తా, నా అవసరాలు మీరు తీర్చండి” అని వయ్యారాలు ఒలకబోస్తూ అంది.

 

 

​”నెక్స్ట్ మినిట్.. యు బ్లడీ బి@చ్, గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్!” అని నిప్పులు చెరిగే కళ్ళతో అరిచాడు.

 

 

​ఆ మినీ డ్రెస్ పాప భయపడి క్యారవాన్ లోనుంచే కాకుండా, అసలు సెట్ నుంచే పరుగెత్తి పారిపోయింది. హీరో గారి అరుపు బయట వరకు వినపడడంతో క్యారవాన్ దగ్గరకు వెళ్ళాడు జాన్. జాన్ లోపలికి రావడం, ఆ అమ్మాయి పరిగెత్తడం ఒకేసారి జరిగాయి.

 

 

​”వాట్ హ్యాపెండ్ సార్?”

 

 

​జరిగింది మొత్తం చెప్పి, “నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ అయితే.. ఆ ప్లేస్ లో ఎవరున్నారు అని చూడకుండా షూట్ చేసి పడేస్తా!” అని చెప్పి, కార్ కీస్ తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు క్రిష్.

 

 

​ఆ డైరెక్టర్ “ఏమైంది సార్?” అని భయపడుతూ అడిగాడు జాన్‌ని.

 

 

​”నథింగ్ సార్” అని కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని, జాన్ ఇంకో కార్ లో విల్లాకి వెళ్ళిపోయాడు.

 

​అది విన్న డైరెక్టర్‌కి ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెలిసిన ఫీలింగ్ వచ్చింది…

 

 

​TO BE CONTINUED…

 

ఎంక్రెజ్ చేయండి ప్రెండ్స్ ప్లీజ్