New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. రాక్షాస్ – 3

Mr. రాక్షాస్ – 3

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ పేరు విన్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయింది 

 

ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంది మా బావ నా అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఫ్రెండ్ వైపు చూసింది 

 

మైత్రి చెప్పిన దానికి బుర్ర గిర్రున తిరిగింది జననీ కి 

 

అయినా అసలు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే, నాకు కూడా తెలియకుండా మీ పక్కనే ఉంటాను కదా నేనెప్పుడూ అడిగింది మైత్రి జననీ వైపు చూస్తూ 

 

అది అనుకొని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది మైత్రి ఆ తర్వాత అతను నాకు 2 వీక్స్ టైం ఇచ్చాడు ఇక్కడ అన్ని సెట్ చేసుకొని అతని దగ్గరికి వెళ్లడానికి ఈరోజుతో ఆ టైం అయిపోయింది అంది జననీ 

 

అబ్బా ఎంత పని చేసావే నీకు మా బావ వాళ్ళింట్లో ఎవ్వరి గురించి తెలియదు కదా దేవుడా వాళ్లు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అయినా బావ నీ పక్కన ఉంటే ఎవరూ బావని ఎదిరించే అంత ధైర్యం చేయరులే కానీ చెప్పలేము ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అయితే వెళ్తావా అడిగింది మైత్రి 

 

వెళ్లాలి కదా మైత్రి అంది జనని నిర్జీవంగా 

 

సరే జాగ్రత్త నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మర్చిపోకు నువ్వు నాకు ఒక్క ఫోన్ చెయ్ నేను అక్కడికి రాగలను సరేనా ఏమైనా బాధగా ఉన్నా కూడా నువ్వు ఒక్కదానివే ఫీల్ అయిపోయి బాధపడిపోకు ప్రతిదీ ఇదివరకు నాతో ఎలా షేర్ చేసుకున్నావో ఇప్పుడు కూడా అలాగే షేర్ చేసుకో ఇక మీద కూడా అర్థమైందా అయినా నాకు నీ మీద చాలా కోపంగా ఉందే చెప్పా పెట్టకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటావే అడిగింది మైత్రి 

 

అబ్బా సారీ మైత్రి ఈ ఒక్కసారికి నన్ను మాఫ్ చెయ్యు ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ గా మాట్లాడేసరికి 

 

సర్లే నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అయిపోకు నేను కూడా మాట్లాడేస్తాను అయినా నా బొంద గాని నీ మీద నేను ఎక్కడ కోపంగా ఉండగలను అది నా వల్ల కాదు అంటూ నవ్వుతూ సైడ్ నుంచి మైత్రి ని హగ్ చేసుకుంది 

 

ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం అక్కడి నుంచి క్యాబ్ లో బయలుదేరాలి అనుకుంది

 

కానీ ఏలోపే రానా నుంచి ఒక మెసేజ్ 

 

కింద నీకోసం కార్ రెడీగా ఉంది ఫైవ్ మినిట్స్ లో నువ్వు కిందకి రావాలి అని ఉన్న మెసేజ్ చూసి తిరిగి మైత్రి వైపు చూస్తూ 

 

మైతూ నేను వెళ్లొస్తాను సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ ఫ్రెండ్ ని వదిలి వెళ్లాలి అని లేకపోయినా కూడా భారంగా అక్కడినుంచి తన లగేజ్ పట్టుకొని బయటకి అడుగులు వేసింది 

 

జనని వెళ్ళిపోతున్నందుకు మైత్రి కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేని స్థితి 

 

జనని లిఫ్ట్ వరకు వెళ్ళగానే తనని ఆపింది మైత్రి 

 

నేను కూడా కార్ వర్క్ వస్తాను నీతో పాటు అంటూ తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకుంది మైత్రి 

 

మైత్రి జనని ఇద్దరు లిఫ్ట్ లో కిందకి వెళ్లారు 

 

ఇక ఎప్పుడైతే కార్ దగ్గరికి ఇద్దరూ వచ్చారు వెంటనే ఇద్దరు చేతిలో ఉన్న బ్యాగులు తీసుకొని వెనక కార్ డిక్కీలో పెట్టేసి మేడం మీరు కూర్చుంటే స్టార్ట్ అవుదాము అన్నాడు అతను వినయంగా 

 

అలాగే అంటూ మైత్రి ని మరొకసారి హత్తుకుని మిస్ యు రా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండవే అంది జననీ 

 

అప్పుడప్పుడు కాదు డైలీ ఫోన్ చేస్తా నీతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు అంటూ జనని బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడినుంచి తనని పంపించింది మైత్రి 

 

కార్ లో తను గూర్చొ గాని కార్ మాత్రం మెరుపు వేగంతో అక్కడి నుంచి దూసుకుపోయింది 

 

ఒక అరగంటకి రానా చెప్పిన హోటల్ ముందు ఆగింది కార్ 

 

మేడం ఇలాగే ఇచ్చి నేను ఇంటి దగ్గర పెట్టేస్తాను సర్ ఇక్కడే ఉంటాను అని చెప్పారు ఒకసారి మీరు సర్ కి ఫోన్ చేసి ఏ ఫ్లోరో కనుక్కొని వెళ్ళండి అంటూ వినయంగా చెప్పేసి అక్కడి నుంచి తను దిగిన వెంటనే వెళ్ళిపోయాడు 

 

హోటల్ బయట నుంచి చూస్తూ ఉన్న జననీ కళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యాయి 

 

కానీ చేసేదేం లేక అక్కడి నుంచి లోపలికి వెళ్తూ రానాకి కాల్ చేసింది 

 

 

 

——–continues…………

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ 

 

 

 

 

నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో :- 

 

 

 

అబ్బా భలే ఉంది ఈ బెడ్ అనుకోకుండా ఉండలేకపోయింది ఒక సైడ్ కి కవర్ ఉండడంతో కొంపతీసి మొన్న కలలో వచ్చినట్టు ఏదో గుడ్డ ముక్కలు కానీ ఇవ్వడు కదా అయ్యో రామ అనుకుంటూ భయపడుతూనే ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది 

 

ఉల్లి పొరకంటే పల్చగా ఉన్న ఒక తెల్ల చీర 

 

ట్రాన్స్పరెంట్ గా ఉంది కట్టుకున్న కట్టుకోకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు అనేటట్టు ఉన్న ఆ చీరని చూసి కళ్ళు తేలేసింది 

 

దేవుడా వీడు ఇలాంటి బట్టలు ఎందుకు ఇవ్వడం నాకు అనుకుంటూ ఆలోచిస్తూ ఇక చేసేదేం లేక అక్కడి నుంచి స్నానానికి వెళ్ళింది