New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. రాక్షాస్ – 4

Mr. రాక్షాస్ – 4

 

 

 

 

 

 

 

 

 

 

హోటల్ బయట నుంచి చూస్తూ ఉన్న జననీ కళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యాయి 

 

కానీ చేసేదేం లేక అక్కడి నుంచి లోపలికి వెళ్తూ రానా కి కాల్ చేసింది  

 

హలో అంటూ వినిపించింది అటు నుంచి ఒక గాంబీర్యమైన స్వరం 

 

రానా గారు నేను జనని అంది జనని భయంగా 

 

హా హోటల్ కి రీచ్ అయ్యావా 

 

హా రీచ్ అయ్యాను ఏ ఫ్లోర్ కి రావాలో చెప్తే అంటూ ఉండగానే 

 

టాప్ ఫ్లోర్ అక్కడ ఒకే ఒక్క రూమ్ ఉంటుంది ఆ రూమ్ లోకి వెళ్ళు అండ్ మంచం మీద ఒక కవర్ ఉంటుంది ఆ కవర్ లో ఉన్న బట్టలు వేసుకుని నేను వచ్చేసరికి రెడీగా ఉండు అర్థమైందా మన కాంట్రాక్ట్ ఈరోజు రాత్రి నుంచి మొదలవుతుంది అంటూ కాల్ కట్ చేసేసాడు రానా 

 

జనని మాట్లాడకుండా అక్కడి నుంచి లిఫ్ట్ వైపు వెళ్లి టాప్ ఫ్లోర్ లోకి వెళ్ళింది 

 

చెప్పినట్టే అక్కడ కేవలం ఒకే ఒక్క రూము ఉండటంతో ధైర్యంగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది 

 

ఆ రూమ్ చూసిన జనని కళ్ళు బైర్లు కమ్మాయి 

 

ఎటు చూసినా లగ్జరీ ఐటమ్స్ తో చాలా రిచ్ గా ఉంది చూడడానికి గది మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఆ బెడ్ మొత్తం పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు 

 

 

అబ్బా భలే ఉంది ఈ బెడ్ అనుకోకుండా ఉండలేకపోయింది ఒక సైడ్ కి కవర్ ఉండడంతో కొంపతీసి మొన్న కలలో వచ్చినట్టు ఏదో గుడ్డ ముక్కలు కానీ ఇవ్వడు కదా అయ్యో రామ అనుకుంటూ భయపడుతూనే ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది 

 

ఉల్లి పొరకంటే పల్చగా ఉన్న ఒక తెల్ల చీర 

 

ట్రాన్స్పరెంట్ గా ఉంది కట్టుకున్న కట్టుకోకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు అనేటట్టు ఉన్న ఆ చీరని చూసి కళ్ళు తేలేసింది 

 

దేవుడా వీడు ఇలాంటి బట్టలు ఎందుకు ఇవ్వడం నాకు అనుకుంటూ ఆలోచిస్తూ ఇక చేసేదేం లేక అక్కడి నుంచి స్నానానికి వెళ్ళింది 

 

బాత్ టబ్ … సెపరేట్గా షవర్ కోసం ఒక క్యాబిన్ లాగా ఉండడం చూసి స్నానం చేసేసి టవల్ లో బయటికి వచ్చి ఆ చీర కట్టుకొని తనని తాను అందంగా అలంకరించుకుంది 

 

మనసంతా ఏదో తెలియని భయం నువ్వు చేస్తుంది తప్పేమో అని తన మనసు తనని హెచ్చరిస్తున్న ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు తను ఆల్రెడీ చేయాల్సింది మొత్తం చేసింది అగ్రిమెంట్ మీద సైన్ కూడా అయిపోయింది ఇప్పుడు తను రానా కి సహకరించకపోతే రానా తనకి డబ్బులు ఇవ్వడం మాట దేవుడు ఎరుగు రిటర్న్ లో తనే తిరిగి అతనికి డబ్బులు ఇవ్వాలి 

 

ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది సరిగ్గా అప్పుడే తన మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసింది 

 

స్క్రీన్ మీద తన తల్లి పేరు కనిపిస్తూ ఉంటే తన దుఃఖం మొత్తాన్ని ఆపుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో మమ్మీ డబ్బులు అరేంజ్ అవుతున్నాయి నువ్వు కంగారు పడకు అంటూ ఉండగానే 

 

ఇప్పుడే ఎవరో వచ్చి మీ నాన్నగారికి డబ్బులు అన్ని కట్టేశారమ్మ నువ్వే పంపించావంట కదా డబ్బులు ఎలా అరేంజ్ అయ్యాయి తల్లి అడిగింది ఆవిడ కూతురి నీ 

 

అంటే అది మన మైత్రి ఉంది కదా వాళ్ళ బావ కి మొత్తం విషయం చెప్పింది అతనే మన పరిస్థితి అర్థం చేసుకొని మనకి డబ్బులు ఇచ్చారు దానికి బదులుగా నేను అతని కంపెనీలో వర్క్ చేస్తున్నాను కొన్నాళ్లు నేను ఇంటికి గాని మీ దగ్గరికి గాని రాలేకపోవచ్చు ఒక టూ ఇయర్స్ అతనికి బాండ్ సైన్ చేశాను నన్ను వేరే ఊరికి పంపిస్తున్నారు నేను అక్కడ వర్క్ చేయాలి అంటూ నోటికేది వస్తే అది చెప్పేసింది తల్లికి అనుమానం రాకుండా 

 

అలాగే తల్లి జాగ్రత్తగా నీ పని చూసుకో చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా ఎవర్ని గుడ్డిగా నమ్మకు తల్లి సరేనా అంటూ కొంచెం సేపు కూతురితో మాట్లాడి ఆ తర్వాత కాల్ కట్ చేసేసింది ఆవిడ 

 

 

 

ఇంతలో రానా నుంచి కొన్ని మెసేజెస్ అందులో తన తండ్రికి కట్టిన డబ్బులు రిసిప్ట్ అండ్ అలాగే ఇంకొక 10 నిమిషాల్లో తను వస్తున్నాడు అన్న విషయం కూడా మెసేజెస్ లో ఉండడం చూసి గబగబా రెడీ అయ్యి తన బాధని అతని ముందు కనిపించనివ్వకుండా పంటి బిగువునా ఆపుకుంటూ అతని కోసం ఎదురుచూస్తూ ఉంది 

 

 

ఇప్పుడు ఆమె మనసు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటివరకు ఒక చిన్న భయం రానా తనని మోసం చేస్తాడేమో తనని వాడుకొని డబ్బులు ఇవ్వకుండా ఉంటాడేమో అని భయపడింది కానీ ఇప్పుడు రానా ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉండడంతో కొంచెం ధైర్యంగా ఉండగలుగుతుంది 

 

చెప్పినట్టే ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు రానా 

 

 

 

 

————-continues………….. 

 

 

 

ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో