New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. రాక్షాస్ – 5

Mr. రాక్షాస్ – 5

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇప్పుడు ఆమె మనసు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటివరకు ఒక చిన్న భయం రానా తనని మోసం చేస్తాడేమో తనని వాడుకొని డబ్బులు ఇవ్వకుండా ఉంటాడేమో అని భయపడింది కానీ ఇప్పుడు రానా ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉండడంతో కొంచెం ధైర్యంగా ఉండగలుగుతుంది 

 

చెప్పినట్టే ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు రానా 

 

ఎందుకో రానా లోపలికి వస్తూ ఉంటే తనకి తెలియకుండానే ఒక రకమైన భయం అలజడి మొదలైపోతున్నాయి జనని లో 

 

రానా రాగానే లేచి నిలబడింది జననీ 

 

తనని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ చూశాడు రానా 

 

హ్మ్మ్ పర్ఫెక్ట్ ఈ చీరలో నేను నిన్ను ఎలా అయితే ఊహించుకున్నానో అచ్చం ఒక్క పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయకుండా అలాగే ఉన్నావ్ ఒక్క 10 మినిట్స్ ఓపిక పట్టు బేబీ ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అంటూ జనని చెంపలు తాకుతూ చెప్పి అక్కడి నుంచి వాష్ రూమ్ లోకి వెళ్లిపోయాడు రానా 

 

జనని కి ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటే చేతులు నలుపుకుంటూ మంచం మీద కూర్చుంది 

 

ఇప్పుడు ఇతను చేసే దానికి ఎంత పెయిన్ వస్తుందో ఏంటో అయినా అన్నిటికి తెగించే ఇక్కడి వరకు వచ్చి ఇలా రెడీ అయ్యావు జనని అతను నాన్న ఆపరేషన్ కి డబ్బులు కూడా అరేంజ్ చేశాడు ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించడం తప్పు అంటూ తన అంతరంగం తనని హెచ్చరిస్తూ ఉంటే మౌనంగా సతమతమవుతూ ఉంది జనని 

 

ఇంకొక పది నిమిషాలకి ఫ్రెష్ అయ్యి టవల్ లో బయటికి వచ్చాడు 

 

తల తుడుచుకుంటూ వెనక్కి తిరిగి కూర్చున్న జనని వైపు చూశాడు 

 

అటువైపు తిరిగి కూర్చొని ఉండటం వల్ల నడుము వరకు ఉన్న హెయిర్ కొంచెం ముందుకి వేస్తే ఇంకొంచెం వెనక్కి వేసింది సైడ్ నుంచి చీర వంపుల్లో నడుము మడతలు లైట్ గా కనిపిస్తూ ఉంటే ఒక రకమైన అలజడి రానా లో 

 

ఫాస్ట్ గా తల తుడుచుకొని వచ్చి జనని పక్కన కూర్చొని తన చేతిని అతని చేతిలోకి తీసుకొని 

 

ముందే చెప్పాను కదా నాకు త్రీ మంత్స్ లోపే నువ్వు గుడ్ న్యూస్ చెప్పాలి అర్థమైంది కదా ప్రతిదీ మన అగ్రిమెంట్ పరంగానే జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఇప్పుడు జరగబోయే దాని గురించి నాకు 0.01% కూడా అవగాహన లేదు ఏ టు జెడ్ మొత్తం అన్ని నువ్వే లీడ్ తీసుకొని చేయాలి కాకపోతే నెక్స్ట్ టైం నుంచి నేనే లీడ్ తీసుకుంటా అన్నాడు తమకంగా జనని పెదాలను తడుముతూ 

 

ఏంటి వీడికి ఏం తెలీదా? నేను లీడ్ తీసుకోవాలా వీడికి ఏమీ తెలియకపోతే ఇంకా నాకేం తెలుస్తుంది నా బొంద కాకపోతే అయినా అలా ఎలా లీడ్ తీసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ రానా వైపు చూసింది 

 

ఏం చేస్తున్నావ్ కమాన్ కం అండ్ కిస్ మీ అంటూ అడగడంతో అదురుతున్న పెదాలతోనే తన పెదాలను రానా పెదాల దగ్గరికి మెల్లగా తీసుకుని వెళ్ళింది ఇంకొక రెండు క్షణాల్లో ఆమె పెదాలు అతని పెదాలను తాకుతాయి అనగా సరిగ్గా అప్పుడే డిస్టర్బెన్స్ లాగా రానా మొబైల్ మోగింది 

 

అది తన పర్సనల్ మొబైల్ కావడంతో వన్ మినిట్ బేబీ అంటూ ఆపి తన ఫోన్ చూశాడు 

 

స్క్రీన్ మీద తన తల్లి పేరు కనిపిస్తూ ఉంటే మమ్మీ ఈ టైం లో ఎందుకు కాల్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రానా 

 

హలో రానా ఎక్కడున్నావ్ నాన్న వెంటనే ఇంటికి రా మీ నానమ్మ చనిపోయారు అంటూ చెప్పడంతో వాట్ నాని చనిపోయిందా కానీ ఎలా అడిగాడు రానా 

 

ఇందాకే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు అంటూ చెప్పడంతో ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి 

 

నువ్వు ఇందాక వచ్చిన డ్రెస్ మార్చుకో మనం నా ఇంటికి వెళ్తున్నాం అంటూ చెప్పడంతో సరే అంటూ గబగబా వేరే రూమ్ లోకి వెళ్లిపోయి తన డ్రెస్ మార్చుకుంది జననీ 

 

అంటే ఇప్పుడు అక్కడికి మైత్రి కూడా వస్తుందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది 

 

ఏయ్ డ్రెస్ మార్చుకున్నావా అంటూ బయట నుంచి రానా గాంబీర్యంగా ప్రశ్నించడంతో 

 

ఆ వస్తున్న అంటూ గబగబా బయటికి వచ్చింది 

 

తనని తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు రానా 

 

ఒక ముప్పావు గంటకి ఒక పెద్ద ప్యాలెస్ ముందు ఆగింది కార్ 

 

ఇంట్లోకి చాలామంది పెద్దపెద్ద వాళ్లు వెళ్తూ కనిపించడంతో జనని చెయ్యి పట్టుకుని వెనుక వైపు నుంచి తీసుకొని పైకి వెళ్ళిపోయాడు రానా 

 

రణగారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది జనని భయంగా 

 

అందరూ వైట్ అండ్ బైటిలో వస్తున్నారు చూడలేదా మనం కూడా అలాగే వెళ్లాలి అంటూ తన చేతిలో ఒక కవర్ పెట్టాడు రానా 

 

ఆ కవర్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది 

 

వైట్ కలర్ లెగ్గిన్ వైట్ కలర్ టాప్ కూడా వైట్ కలర్ లో ఉండడంతో ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటికి వచ్చింది అర్జున్ కూడా వైట్ షర్ట్ ఇంకా వైట్ ప్యాంటు వేసుకొని భార్యని తీసుకొని తిరిగి కిందకి వెళ్లిపోయి ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ లో నుంచే లోపలికి అడుగుపెట్టాడు రానా జననీతో కలిసి 

 

జననీ కళ్ళు మాత్రం మైత్రి కోసం వెతుకుతూ ఉన్నాయి 

 

చనిపోయిన ఆ ముసలావిడ దగ్గర కూర్చుని సైలెంట్ గా ఆమె వైపే చూస్తూ కనిపించింది మైత్రి 

 

రానా తన పక్కనే ఒక అమ్మాయిని చూసినా ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు కానీ అడగడానికి అది సందర్భం కాదు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయారు 

 

రానా మాత్రం జనని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్లి అక్కడే పెట్టినా గులాబీ రేకులు కొన్ని తను చేతిలోకి తీసుకొని ఇంకొన్ని జనని చేతికి ఇచ్చి ఆవిడ పాదాల దగ్గర వేసి నమస్కరించి సైడ్ కి కూర్చున్నాడు తన పక్కనే కూర్చుంది జననీ కూడా 

 

 

కొంతసేపటికి అక్కడికి వచ్చారు ఇంకొక ఫ్యామిలీ 

 

వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక కూతురు వచ్చి బాధగా రానా నానమ్మ డెడ్ బాడీ మీద పువ్వులు వేసి అక్కడ కూర్చున్నారు 

 

వచ్చిన ఆ అమ్మాయి మాత్రం తను వచ్చింది చావు ఇంటికి అని కూడా లేకుండా రానా అని కొరుక్కుతినేలా చూస్తూ తన పక్కనే ఉన్న జననీ వైపు అనుమానంగా చూసింది 

 

ఇక టైం అవుతూ ఉండటంతో బంధువులు చెప్పడంతో ఇక ఆమె బాడీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ 

 

ఆడవాళ్లు తప్ప మగవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మన రానా బాబు కూడా వెళ్లలేదు లెండి 

 

ఇక పనివాళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే రానా తల్లి మాత్రం కన్నా ఎవరీ అమ్మాయి అడిగారు అనుమానంగా 

 

నా వైఫ్ మమ్మీ అన్నాడు రానా జనని భుజం చుట్టూ చేతులు వేసి 

 

ఆ మాటకి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం జనని నీ చంపేసేలా చూస్తూ ఉంది 

 

జనని నువ్వు మా రానా నీ పెళ్లి చేసుకున్నావా ఎప్పుడు చేసుకున్నావ్ రా అడిగారు మైత్రి తల్లి మాధురి గారు 

 

కనీసం మైత్రి కూడా చెప్పలేదు అడిగారు ఆవిడ కూతురు వైపు చూస్తూ 

 

మాధురి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా 

 

తెలుసా ఏంటి వదిన చాలా మంచి పిల్ల రానా నీ సెలక్షన్స్ సూపర్ రా వదిన తను బంగారం నువ్వు కూతురు లేదు అని బాధపడుతూ ఉండే దానివా జనని వచ్చిన తర్వాత నీకు ఆ లోటు ఉండదు తను అంత మంచిది అన్నారు మాధురి గారు జనని నీ చూస్తూ 

 

మాధురి అసలు ఇక్కడ ఏంటి సిట్యుయేషన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ చనిపోయింది ఆ బాధ ఉందా నీకు ఏమైనా అంటూ మాధురి మీద అరుస్తూ ఉంది తన అక్క సులోచన 

 

ఇప్పుడు నేనేమన్నాను అక్క జననీ గురించి చెప్పాను అంతే కదా అడిగారు మాధురి గారు అయోమయంగా 

 

ఎవరు పడితే వాళ్ళు నా అన్న ఇంటికి కోడలు అయిపోరు అంటూ జనని వైపు చూస్తూ చెప్పి అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళిపోయింది సులోచన తన వెనకే ఆమె కూతురు కూడా 

 

 

 

 

————-continues…………

 

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ