నేను చిన్నగా చూశారుగా ఇంకా బయలుదేరండి ఇలా మనం ఒకే గదిలో ఉండడం బాగుండదు అని చెప్పాను
వెళ్తాను లే దా పడుకుందామన్నాడు నేను ఏంటి అని బెడ్ మీద నుంచి లేచి నిలుచున్నాను భయపడకు నిన్ను ఏం చేయను నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది కొంచెం సేపు నిన్ను చూస్తూ పడుకుంటాను అని చెప్పాడు
నేను అలానే నిల్చోనే ఉంటే నాకు ఏ విషయాం రెండోసారి చెప్పే అలవాటు లేదు మైత్రి అన్నాడు
నేను మనసులో ఈ భగవాన్ ఇప్పుడు నన్ను కాపాడే వారు లేరా అని అనుకుంటుండగా ప్రస్తుతానికి ఎవరు లేరు నేనే ఇక్కడ ఉండేది పడుకో అన్నాడు
ఇక తప్పక వెళ్లి మంచం పై ఓ మూలన పడుకున్నాను అంతే నన్ను ఏదో తన పెళ్ళాన్ని లాక్కున్నట్టు తన వైపుకు లాక్కొని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు తన ఊపిరి నాకు నా ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా ఉన్న నేను దూరంగా జరగడానికి ప్రయత్నించాను కదిలావంటే గాలి కూడా దూరలేనంత గట్టిగా పట్టుకుంటాను అన్నాడు ఇక కదలడం ఆపి గమ్ముగా ఉన్నాను
కొంతసేపటికి నిద్రపోయాడని నాకర్థమైంది అతన్ని చూస్తే నిజంగానే ప్రశాంతంగా పడుకున్నాడని అనిపించింది కానీ నాకు నా నిద్ర కరువైంది చూసి చూసి ఇంకా టైం తెల్లవారుజాము 4:30 అవుతుండగా చిన్నగా నాధ్ నాధ్ అని పిలిచాను