నేను బండి డ్రైవ్ చేస్తూ నాధ్ కంటపడకుండా కాలేజీకి వెళ్లాలని ఆలోచిస్తుంది రాత్రి ఇంటికి వచ్చాడని తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ కాలేజీకి చేరుకున్నాను అక్కడ ఎక్కడ నాకు నాధ్ కనిపించలేదు హమ్మయ్య అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఇక్కడికి రాలేదు అని అన్నాను
కళా నా వైపు తిరిగి రాలేదని బాధపడుతున్నావ్ ఏంటే అని అడిగింది నేను కళా తో నిన్నటివి ఇప్పటివి కలిపి దెబ్బలు ఇప్పుడే తింటా వెంటే అని అడిగాను
కళా వద్దులే తల్లి పదా క్లాస్ కి పోదామని ఇద్దరం క్లాస్ కి వెళ్తుంటే అందరూ మమ్మల్నే చూస్తున్నారు కళా నన్ను తన మోచేత్తో పొడుస్తూ మైత్రి ఏదో తేడాగా ఉంది అందరూ మనల్ని చూస్తున్నారు అంది
కనిట్టింది పెద్ద సైంటిస్ట్ అది నాకు కనపడుతుంది ఎందుకో తెలియటం లేదు అన్నాను నేను క్లాస్ కి వెళ్లేటప్పటికి అందరూ వచ్చేసి ఉన్నారు వాళ్లు కూడా అలానే చూస్తున్నారు ఇంకేమీ అర్థం కాక సైలెంట్ గా వెళ్లి మా ప్లేస్ లో కూర్చున్నాము క్లాసులు మొదలయ్యాయి
ఓ రెండు క్లాసులు గడిచాక నావల్ల కావటం లేదు నాకు నిద్ర వచ్చేస్తుంది లెక్చరర్ క్లాస్ చెప్తున్నా నాకు నిద్ర ఆగటం లేదు అప్పుడే మా క్లాసులో సార్ ఈ పిరియడ్ లీజర్ కదా మేము లైబ్రరీ కి వెళ్ళాలి అని వాయిస్ వినిపించింది
నేను దేవుడా అది నాధ్ వాయిస్ అయ్యి ఉండకూడదు అనుకుంటూ వెనకకు తిరిగాను లాస్ట్ బెంచ్ లో కూర్చుని నన్నే చూస్తున్నాడు కళా నా చేతిపై తడుతూ క్లాసులో ఉన్నాడే అంది నేను దాని వైపు తిరిగి నాకు కనిపిస్తుంది ముందు నువ్వు తట్టడం ఆపు అన్నాను